Vizianagaram Police: యువతిపై దాడి కేసును ఛేదించిన విజయనగరం పోలీసులు
యువతిపై దాడి కేసును ఛేదించిన విజయనగరం పోలీసులు
Vizianagaram Police : ఏపీలో సంచలనం సృష్టించిన యువతిపై దాడి కేసును విజయనగరం(Vizianagaram) పోలీసులు ఛేదించారు. విజయనగరం జిల్లా గరివిడి మండలం శివరాం గ్రామానికి చెందిన కోండ్రు అఖిలపై దాడి చేసిన నిందితుడ్ని అరెస్ట్ చేసారు. అతని వద్ద నుండి దాడికి ఉపయోగించిన చాకు, రక్తపు మరకలతో కూడిన బట్టలు, బ్లూటూత్ ఇయర్ బడ్స్, మరియు ఒక సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు విజయనగరం(Vizianagaram) ఎస్పీ వకుల్ జిందాల్… తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుడ్ని ప్రవేశపెట్టి కేసు వివరాలను వెల్లడించారు. ఒక పూర్తి వివరాల్లోకి వెళితే…
Vizianagaram Police Chased
శివరాం గ్రామానికి చెందని కోండ్రు అఖిల సోదరులకు బూర్లె ఆదినారాయణ అనే స్నేహితుడు ఉన్నాడు. ఆదినారాయణ తరచూ అఖిల ఇంటికి వస్తూ ఉండేవాడు… ఆమెను చెల్లి అని పిలిచేవాడు. అయితే అఖిల గత కొంతకాలంగా వేరొక వ్యక్తితో ఎక్కువగా ఫోన్ మాట్లాడటాన్ని గమనించిన ఆదినారాయణ… ఆమెను మందలించాడు. ఇది ఇలా ఉండగా… ఆదినారాయణ విజయవాడకు చెందిన ఓ మహిళకు తన ఇన్ స్టా గ్రామ్ లో అసభ్యకరమైన మెసేజ్ లు పంపించాడు. ఈ విషయం అఖిలకు తెలిసి తన స్నేహితులు, బంధువులకు చెప్పింది. దీనితో తనపై చేసిన దుష్ప్రాచారం ఇక్కడితో ఆపివేయాలని… లేకపోతే చంపేస్తానని బెదిరించాడు. ఇంతలో ఏమైందో ఏమో గాని… శనివారం అఖిల వంట పాత్రలు కడుగుతుండగా… ఇంట్లో చొరబడిన ఆదినారాయణ… ఆమెపై కత్తితో దాడి చేసాడు. ఆమె సహాయం కోసం కేకలు వేయడంతో కత్తిని అక్కడే వదిలిపెట్టి పారిపోయాడు. దీనితో స్థానికులు ఆమెను హుటాహుటీన చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరం(Vizianagaram) లోని తిరుమల మెడికవర్ హాస్పిటల్ కు తరలించారు.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న గరివిడి పోలీసులు… క్లూస్ టీం, డాగ్ స్వాడ్ ను రప్పించి ఆధారాలు సేకరించారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కూడా ఘటనా స్థలానికి చేరుకుని… ఈ కేసును చేధించేందుకు ప్రత్యేకంగా ఐదు బృందాలను ఏర్పాటు చేసి, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాధితురాలి సమాచారం ఆధారంగా నిందితుడు ఆదినారాయణను అరెస్ట్ చేసారు. విచారణలో నిందితుడు బురిలి ఆదినారాయణ నేరంను అంగీకరించగా… హత్యాయత్నంకు వినియోగించిన కత్తి, మంకీ క్యాప్, నోయిన్ బ్రాండ్ ఇయర్ బడ్, మొబైల్ ఫోను, బట్టలను స్వాధీనం చేసుకున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ… మహిళలపై ఎవరైనా దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, ఈ తరహా కేసులను తీవ్రంగా పరిగణించి,న్యాయస్థానాల్లో త్వరితగతిన శిక్షింపబడే విధంగా చర్యలు చేపడతామన్నారు. ఈ కేసులను రాష్ట్ర హెూంమంత్రి, రాష్ట్ర డిజిపి, అడిషనల్ డిజి, డిఐజి నిరంతరం పర్యవేక్షించారన్నారు. ఈ కేసులో నిందితుడిని నేరంకు పాల్పడిన రెండు గంటల వ్యవధిలోనే అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా దర్యాప్తు పూర్తి చేసి, కేసు త్వరలో ట్రయల్ పూర్తయ్యే విధంగాను, నిందితడు కఠినంగా శిక్షింపబడే విధంగా చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ కేసులో క్రియాశీలకంగా పని చేసిన చీపురుపల్లి డిఎస్పీ ఎస్.రాఘవులు, చీపురుపల్లి ఇన్చార్జ్ సిఐ హెచ్.ఉపేంద్రరావు, గరివిడి ఎస్ఐ బి.లోకేశ్వరరావు, కానిస్టేబుళ్ళు యు.ఆనందరావు. టీ.హరి లను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించి, ప్రశంసా పత్రాలను ప్రదానం చేసారు.
Also Read : Street Dog Attack: గుంటూరులో విషాదం ! వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ళ బాలుడు మృతి !