Mark Shankar Pawanovich: కోలుకుంటోన్న పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్

కోలుకుంటోన్న పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్

Mark Shankar Pawanovich : సింగపూర్ లోని ఓ స్కూల్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనో విచ్ కొలుకొంటున్నాడు. బుధవారం అతడ్ని ఐసీయూ నుంచి గదిలోకి మార్చారు. మరో మూడు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో అతడు ఉండాలని సూచించారు. ఈ ప్రమాదంపై సమాచారం తెలియగానే చిరంజీవి దంపతులతోపాటు పవన్ కల్యాణ్ సింగపూర్ బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సింగపూర్‌ వెళ్లిన పవన్‌… మార్క్‌శంకర్‌ను(Mark Shankar Pawanovich) చూసిన అనంతరం వైద్యులతో ఆయన మాట్లాడారు. మార్క్‌ కోలుకుంటున్నాడని.. ఊపిరితిత్తుల్లో పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని వైద్యులు పవన్‌కు తెలిపారు. మార్క్‌ శంకర్‌కు తొలుత అత్యవసర వార్డులో చికిత్స అందించిన వైద్యులు… బుధవారం ఉదయం గదికి మార్చారు. మరో మూడు రోజులపాటు పర్యవేక్షణలో ఉంచి పలు పరీక్షలు చేయాల్సి ఉందని వైద్యులు తెలిపారు.

Mark Shankar Pawanovich Health Updates

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌కి(Mark Shankar Pawanovich) సింగపూర్‌ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. మంగళవారం స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక విద్యార్థి మరణించగా… పలువురు గాయపడ్డారు. వారిలో మార్క్ శంకర్ ఉన్నారు. అతడి కాళ్లు, చేతులకు గాయాలు కావడంతోపాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో… అతడికి వైద్యులు అత్యవసర విభాగంగా ఉంచి చికిత్స అందించారు. అనంతరం బుధవారం మరో గదిలోకి అతడిని మార్చారు. మరికొద్ది రోజులు ఆ బాలుడిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మార్క్ శంకర్ ఫొటోను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మంగళవారం అల్లూరి సీతారామరాజు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారికంగా పర్యటిస్తున్నారు. ఆ సమయంలో అతడి కుమారుడు మార్క్ శంకర్ చదువుతోన్న సింగపూర్‌లోని స్కూల్‌లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బాలుడికి కాళ్లు, చేతులకు గాయాలైనట్లు పవన్ కళ్యాణ్‌కు సమాచారం అందింది. దీనితో ఆయన హుటాహుటీన సింగపూర్ వెళ్లారు. ఆ క్రమంలో పెద్ద సోదరుడు చిరంజీవి దంపతులతో కలిసి పవన్ సింగపూర్ బయలుదేరి వెళ్లారు.

మరోవైపు సింగపూర్‌లో మార్క్ శంకర్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ.. స్వయంగా పవన్ కల్యాణ్‌కు ఫోన్ చేసి ఆరా తీశారు. ధైర్యంగా ఉండాలని పవన్ కళ్యాణ్ కు సూచించారు. అలాగే మార్క్ శంకర్ ఆరోగ్యంపై పర్యవేక్షించాలంటూ సింగపూర్‌లోని భారత రాయబార కార్యాలయంలోని అధికారులకు మోదీ కీలక సూచనలు చేశారు. సీఎం చంద్రబాబు కూడా మార్క్ శంకర్ ఆర్యోగం గురించి పవన్ కళ్యాణ్‌ కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Also Read : Weather Update: ‘క్యుములోనింబస్‌’ ప్రభావంతో తెలంగాణకు భారీ వర్ష సూచన

Leave A Reply

Your Email Id will not be published!