Megastar Chiranjeevi: మార్క్ శంకర్ ఆరోగ్యంపై కీలక అప్ డేట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి

మార్క్ శంకర్ ఆరోగ్యంపై కీలక అప్ డేట్ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి

Megastar Chiranjeevi : సింగపూర్ లోని స్కూలులో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తనయుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్యంపై మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కీలక అప్ డేట్ ఇచ్చారు. తన అఫీషియల్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మార్క్ శంకర్ ఆరోగ్యంపై పూర్తి సమాచారం ఇచ్చారు. అంతేకాదు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన అందరికీ తన మరియు పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల తరపున కృతజ్ఞతలు తెలిపారు.

Megastar Chiranjeevi Comment

మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కుల దైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే ఉంటాడు. రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుండి, ఓ విషాదం నుండి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా నిలిచాడు. ఈ సందర్భంగా ఆయా ఊళ్ళల్లో, ఆయా ప్రాంతాల్లో మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడి ఆ బిడ్డ కోసం ప్రార్ధనలు చేస్తున్నారు, ఆశీస్సులు అందజేస్తున్నారు. నా తరపున, నా తమ్ముడు కళ్యాణ్ బాబు తరపున, మా కుటుంబం యావన్మంది తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంటూ మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేసారు. ఈ పోస్ట్ కు సింగపూర్ లో పవన్ కళ్యాణ్ తో కలిసి దిగిన ఫోటోను కూడా జోడించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Also Read : Chebrolu Kiran Kumar: వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ కార్యకర్త కిరణ్ అరెస్ట్

Leave A Reply

Your Email Id will not be published!