Mother: కూల్‌ డ్రింక్‌ లో విషం కలిపి కుమార్తెను హతమార్చిన కన్నతల్లి

కూల్‌ డ్రింక్‌ లో విషం కలిపి కుమార్తెను హతమార్చిన కన్నతల్లి

Mother : బాచుపల్లి పోలీస్‌ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్‌ లో దారుణం జరిగింది. కన్నతల్లే నాలుగేళ్ల కూతురికి కూల్ డ్రింక్‌ లో ఎలుకల మందు కలిపి ఇచ్చి చంపేసింది. అనంతరం తల్లి కృష్ణ పావని సైతం విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. శనివారం ఈ ఘటన జరగగా… ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…

Mother Kills Her Son

ప్రగతినగర్(Pragathi Nagar) ఆదిత్య గార్డెన్‌ లో ఓ అపార్ట్‌మెంట్‌ లో సాంబశివరావు, తన భార్య నంబూరి కృష్ణ పావని, కూతురు జశ్వికలతో కలిసి నివాసం ఉంటున్నారు. 18వ తేదీ (శుక్రవారం) సాయంత్రం ఇంట్లో భర్త లేని సమయంలో కృష్ణ పావని… తమ కూతురు జశ్వికకు కూల్‌ డ్రింక్‌ లో ఎలుకల మందు తాగించి… ఆ తర్వాత తాను తాగింది. అయితే 19వ తేదీ తెల్లవారుజామున విషం తాగినట్లు గుర్తించిన భర్త… భార్య, కూతురిని ఆసుపత్రికి తరలించారు.

ఆదివారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ చిన్నారి జశ్విక మృతి చెందింది. తల్లి కృష్ణ పావని ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. కృష్ణ పావనికి ఆరోగ్య సమస్యల కారణంగానే దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం కృష్ణ పావని పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలోని ఐసీయులో చికిత్స అందిస్తున్నారని పోలీసులు తెలిపారు.

క్రికెట్‌ ఆడుతూ గుండెపోటుతో యువకుడు మృతి

మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. రాంపల్లి దాయరలో క్రికెట్ ఆడుతూ క్రికెట్ గ్రౌండ్‌లోనే ఓ యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. మృతుడు ఓల్డ్ బోయినపల్లి చెందిన ప్రణీత్(32)గా గుర్తించారు. త్యాగి స్పోర్టస్ వెన్యూ గ్రౌండ్ లో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా ఈ ఘటన జరిగింది. తోటి ఆటగాళ్ళ వెంటనే ప్రణీత్ ను ఆసుపత్రికి తరలించినప్పటికీ… అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు నిర్దారించారు. దీనితోమృతుడి కుటుంబంలో విషాదం నెలకొంది.

Also Read : NIMS: నిమ్స్‌ అగ్నిప్రమాదంలో వెలుగులోకి సంచలన విషయాలు

Leave A Reply

Your Email Id will not be published!