TDP Leader: ఒంగోలులో టీడీపీ నేతదారుణ హత్య

ఒంగోలులో టీడీపీ నేతదారుణ హత్య

 

ఒంగోలులో దారుణం జరిగింది. నాగులప్పలపాడు మాజీ ఎంపీపీ, టిడిపి నేత, మద్యం వ్యాపారి ముప్పవరపు వీరయ్య చౌదరిను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేసారు. మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ఒంగోలులోని పద్మ టవర్స్ లో తన ఆఫీస్ లో వీరయ్య చౌదరి ఉండగా… ముగ్గురు వ్యక్తులు ముసుగు వేసుకొని ఆఫీసులోకి చొరబడ్డారు. అనంతరం వీరయ్య చౌదరిపై కత్తులతో దాడి చేశారు. స్థానికులు గమనించి వీరయ్యను ఆసుపత్రికి తరలించినప్పటికీ … అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు దృవీకరించారు. టీడీపీ నేత హత్యపై సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ దామోదర్… వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. వీరయ్య చౌదరి హత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వీరయ్య మృతదేహాన్ని రిమ్స్‌ కి తరలించారు. టీడీపీ నేత హత్యతో ఒంగోలులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

 

అధికార పార్టీ నేత వీరయ్య చౌదరి హత్యతో ఒంగోలు నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబుకు వీరయ్య చౌదరి స్వయానా మేనల్లుడు. ప్రస్తుతం ఆయన టీడీపీ జిల్లా అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. మద్యం బిజినెస్ చేసే వీరయ్య చౌదరి హత్యకు గల కారణాలు ఏంటనేది తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒంగోలు- ఎంపీ మాగుంట, మంత్రి డా. స్వామి, ఎమ్మెల్యేలు బీఎన్ విజయ్ కుమార్, దామచర్ల జనార్దన్, ఏపీ మారిటైమ్ చైర్మన్ సత్య, ఎస్పీ తదితరులు ఆసుపత్రి వద్దకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఏపీటీడీసీ చైర్మన్ డా. నూకసాని బాలాజీ వీరయ్య చౌదరి హత్యను తీవ్రంగా ఖండించారు. దోషులను వెంటనే అరెస్ట్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your Email Id will not be published!