Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తో అజిత్ దోవల్ కీలక భేటీ

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తో అజిత్ దోవల్ కీలక భేటీ

Amit Shah : ‘ఆపరేషన్ సిందూర్‌’తో భారత్‌-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పాక్‌ రెచ్చగొట్టే చర్యలకు దీటుగా బదులిచ్చేందుకు కేంద్రం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. అన్ని అత్యవసర వ్యవస్థల పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. ఈ క్రమంలో వరుస భేటీలు జరుగుతున్నాయి. తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా(Amit Shah)… డైరెక్టర్ జనరల్ ఆఫ్ బీఎస్‌ఎఫ్, డైరెక్టర్ జనరల్‌ ఆఫ్ సీఐఎస్‌ఎఫ్, హోంశాఖలోని సీనియర్ అధికారులతో భేటీ అయ్యారు. సరిహద్దుల్లో , విమానాశ్రయాల్లో భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అమిత్ షా నివాసంలో జరిగిన ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దొవల్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సరిహద్దుల్లో భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు… ఒకవేళ పాకిస్తాన్… సీ టూ సర్ఫ్రేస్, ఎయిర్ టూ సర్ప్రేస్ దాడులకు ప్రయత్నిస్తే తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై చర్చించారు. అంతేకాదు పాకిస్తాన్ పై ఎలా దాడులు చేయాలి… ఉగ్రవాదాన్ని సమూలంగా ఎలా నాశనం చేయాలి అనే దానిపై కూడా వారు చర్చించారు.

Amit Shah – సీఐఎస్ఎఫ్‌ కు అమిత్‌ షా కీలక ఆదేశాలు

సరిహద్దుల్లో భద్రత, ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ అరేంజ్‌మెంట్లపై శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులతో అమిత్‌షా సమావేశమయ్యారు. ఇండియా-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా(Amit Shah)… కేంద్ర పారిశ్రామిక భద్రతా దళాలకు కీలక ఆదేశాలిచ్చారు. కీలక సంస్థలు, మౌలిక సదుపాయాల కల్పన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని శుక్రవారం నాడు ఆదేశించారు. విమానాశ్రయాలు, విద్యుత్ ప్లాంట్లు, న్యూక్లియర్ ఇన్‌స్టలేషన్స్, అంతరిక్ష పరిశోధనా సంస్థలు, కీలక ప్రభుత్వ భవనాల రక్షణ బాధ్యత సీఐఎస్ఎస్ చేపడుతోంది. సరిహద్దుల్లో భద్రత, ఎయిర్‌పోర్ట్ సెక్యూరిటీ అరేంజ్‌మెంట్లపై శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్, హోం మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులతో అమిత్‌షా సమావేశమయ్యారు. పరిస్థితిని సమీక్షించారు.

భారత్ లో చొరబాటు ఘటనలు చోటుచేసుకుంటున్న తరుణంలో పాక్‌ తో సరిహద్దు పంచుకుంటున్న ఆయా రాష్ట్రాలు ఇప్పటికే కీలక చర్యలు చేపట్టాయి. మన దేశంలోకి చొరబాటుకు యత్నించిన పాకిస్థాన్‌(Pakistan) కు చెందిన వ్యక్తిని పంజాబ్‌ సరిహద్దు వద్ద బీఎస్ఎఫ్‌కు చెందిన జవాన్లు హతమార్చిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌ లో 1,037 కిలోమీటర్లున్న పాక్‌ సరిహద్దును మూసివేశారు. ఎవరైనా సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా వ్యవహరిస్తే… కాల్చివేసేలా ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మూకశ్మీర్‌ లోని సాంబ జిల్లాలో సరిహద్దు దాటి చొరబడేందుకు పాక్‌ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాలను బీఎస్‌ఎఫ్‌ తిప్పికొట్టింది. కనీసం ఏడుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. పాకిస్థాన్‌ నేడు కూడా నియంత్రణ రేఖకు ఆవలివైపు నుంచి భారీస్థాయిలో షెల్లింగ్‌ కొనసాగిస్తోంది. ముఖ్యంగా ఉరి, జమ్మూకశ్మీర్‌ ప్రాంతాల్లో వీటి తీవ్రత ఎక్కువగా ఉంది. చాలామంది ప్రజలు ఇప్పటికే ఈ ప్రాంతాల్లో ఇళ్లు ఖాళీ చేసి వెళుతున్నారు.

Also Read : Rajnath Singh: త్రివిధ దళాధిపతులు సహా సీడీఎస్‌తో రాజ్‌నాథ్‌ సింగ్‌ కీలక భేటీ

Leave A Reply

Your Email Id will not be published!