Randhir Jaiswal: ‘ఆపరేషన్‌ సిందూర్’పై భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన

‘ఆపరేషన్‌ సిందూర్’పై భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన

Randhir Jaiswal : ‘ఆపరేషన్‌ సిందూర్’ పై భారత విదేశాంగ శాఖ మంగళవారం కీలక ప్రకటన చేసింది. జమ్మూ కాశ్మీర్ విషయంలో భారత్ విధానంలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేసింది. కాల్పుల విరమణపై డీజీఎంవోల సమావేశంలో చర్చించామని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్(Randhir Jaiswal) వెల్లడించారు. మే 10వ తేదీన పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ నుంచి ఫోన్ వచ్చిందని చెప్పారు. ఆ క్రమంలో ఈ భేటీలో కాల్పుల విరమణపై నిర్ణయం తీసుకున్నామన్నారు.

Randhir Jaiswal Key Comments on ‘Operation Sindoor’

కాల్పుల విరమణ ప్రతిపాదత పాకిస్థాన్ నుంచే వచ్చిందన్నారు. జమ్మూ కాశ్మీర్‌ విషయంలో ఎలాంటి మార్పులు లేవని ఆయన స్పష్టం చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ ను ఖాళీ చేయించాలన్నదే భారత్ విధానమని రణ్‌ధీర్ జైస్వాల్ కుండబద్దలు కొట్టారు. కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వం అవసరం లేదని స్పష్టం చేశారు. ద్వైపాక్షిక విధానంతోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తోందని రణ్‌ధీర్‌ జైస్వాల్‌(Randhir Jaiswal) విశ్వాసం వ్యక్తం చేశారు. ‘ఆపరేషన్‌ సిందూర్(Operation Sindoor)’ జరుగుతోన్న సమయంలో భారత్, అమెరికా నాయకులు మాట్లాడారని గుర్తు చేశారు. అయితే ఇందులో వాణిజ్యపరమైన అంశాలపై చర్చ జరగలేదని చెప్పారు. ఇక సింధూ నది జలాల ఒప్పందంపై సస్పెన్షన్ కొనసాగుతుందన్నారు. కాశ్మీర్‌పై తమ విధానం మారలేదని తెలిపారు. కాశ్మీర్ అంశంపై ద్వైపాక్షింగా చర్చిస్తామని పేర్కొన్నారు.

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ పైనే చర్చలు ఉంటాయని ఆయన వివరించారు. టిఆర్ఎఫ్ లష్కరితోయోబా అనుబంధ సంస్థ అని తెలిపారు. దీనిపై అంతర్జాతీయంగా నిషేధం విధించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించిన భారత భూభాగాన్ని వదిలివేయడం అనేది మిగిలి ఉన్న విషయమని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.

యుద్ధంలో గెలిచినా పీవోకేను ఎందుకు వదిలేశారు – అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ

పాక్‌ తో కాల్పుల విరమణ అంశంపై ప్రధాని మోదీని ప్రశ్నించే హక్కు కాంగ్రెస్‌ పార్టీకి లేదని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో ఘన విజయం సాధించినా.. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే)ను తిరిగి వశపరచుకునేందుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వెనకాడిందని ప్రశ్నించారు. ‘చికెన్‌ నెక్‌ ఆఫ్‌ ఇండియా’గా పిలిచే సిలిగుడి కారిడార్‌ ను కనీసం 100 మైళ్ల మేర అయినా ఎందుకు విస్తరించలేకపోయారని ప్రశ్నించారు. గువాహటిలో నిర్వహించిన మీడియా సమావేశంలో హిమంత బిశ్వ శర్మ మాట్లాడారు. ఒకవేళ ఇందిరాగాంధీ బతికి ఉంటే ఇవే ప్రశ్నలు ఆమెనే అడిగేవాడినని అన్నారు.

‘‘ 1971లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో భారత సైన్యం అఖండ విజయం సాధించింది. పీవోకేను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి గానీ, ఈశాన్య రాష్ట్రాలను మిగతా భారతదేశానికి కలిపే ‘చికెన్‌ నెక్‌’ను విస్తరించేందుకుగానీ, అదే సరైన సమయం. ప్రధానిగా ఉన్న ఇందిరా గాంధీ అప్పట్లో ఆ పని ఎందుకు చేయలేదు?వివిధ దేశాల సరిహద్దులకు దగ్గరగా ఉండే ఈ వ్యూహాత్మక ప్రాంతాలను అప్పుడే భారత్ అధీనంలోకి తీసుకోవాల్సింది.’’ అని బిశ్వశర్మ అన్నారు.

తాజాగా పాకిస్థాన్‌తో కాల్పుల విరమణపై ఆయన మాట్లాడుతూ… పహల్గాం ఉగ్రదాడికి పాల్పడిన వారికి తగిన బుద్ధి చెప్పేందుకు, పాకిస్థాన్‌లోని ఉగ్రవాద నెట్‌వర్క్‌ను పూర్తిగా నాశనం చేసేందుకే ‘ఆపరేషన్‌ సిందూర్‌’ చేపట్టినట్లు చెప్పారు. ఆ లక్ష్యం పూర్తయిందని, అందుకే పాక్‌తో కాల్పుల విరమణకు భారత్‌ అంగీకరించిందని తెలిపారు. ఉగ్రవాదులకు వత్తాసు పలికిన పాక్‌ సైన్యానికి కూడా భారత్‌ ఆర్మీ తగిన రీతిలో బదులిచ్చిందని పేర్కొన్నారు. భారత్ శక్తి ముందు నిలవలేమని భావించిన పాక్‌ కాళ్ల బేరానికి వచ్చిందని ఎద్దేవా చేశారు.

Also Read : Minister Vangalapudi Anitha: విజయనగరంలో హోం మంత్రి అనిత కొవ్వొత్తుల ప్రదర్శన

Leave A Reply

Your Email Id will not be published!