Indian Army: సీజ్‌ఫైర్‌ పై ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన

సీజ్‌ఫైర్‌ పై ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన

 

 

భారత్-పాకిస్థాన్ మధ్య తాత్కాలికంగా పాటిస్తున్న కాల్పుల విరమణ ఒప్పందంపై ఇండియన్ ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. కాల్పుల విరమణకు ఎలాంటి గడువు లేదని స్పష్టం చేసింది. కాల్పుల విరమణతో పాటు ఆదివారం నాడు జరగాల్సిన డీజీఎంవో చర్చల మీదా క్లారిటీ ఇచ్చింది. ఈ రోజు ఎలాంటి చర్చలు లేవని తెలిపింది. మే 12వ తేదీన జరిగిన డీజీఎంవోల చర్చల్లో భాగంగా కాల్పుల విరమణను కొనసాగించాలని నిర్ణయించినట్లు భారత ఆర్మీ అధికారులు తెలిపారు. దీనికి ఎటువంటి గడువు లేదని స్పష్టం చేశారు.

 

 

ఇండియా-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ముగుస్తున్నట్లు వస్తున్న న్యూస్‌ ను కేంద్ర రక్షణ శాఖ వర్గాలు ఖండించాయి. సీజ్‌ఫైర్ అవగాహనకు డెడ్‌లైన్ లేదని తెలిపాయి. ఈ నెల 10వ తేదీన ప్రకటించిన కాల్పుల విరమణ అవగాహనే ఇంకా కొనసాగుతుందని రక్షణ శాఖ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. పదో తేదీన జరిగిన డీజీఎంవో జరిగిన చర్చల్లో తీసుకున్న నిర్ణయానికి ఎలాంటి కాలపరిమితి లేదని పేర్కొన్నాయి. ఇవాళ ఇరు దేశాల డీజీఎంవో స్థాయిలో ఎలాంటి చర్చలు లేవని రక్షణ శాఖ వర్గాలు వివరించాయి.

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌ చేపట్టిన ప్రతీకార దాడులతో పాకిస్తాన్‌ ఉక్కిరిబిక్కిరయ్యింది. ఆపరేషన్‌ సిందూర్‌తో దాయాది దేశం విలవిల్లాడింది. చివరకు ఉద్రిక్తతలు తగ్గించాలని అగ్రరాజ్యం అమెరికా ద్వారా పాక్‌ శరణుగోరింది. పాక్‌ అర్జించడంతో భారత్ కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించింది. మే 10న ఇరు దేశాల డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌ (DGMOs) స్థాయిలో కాల్పుల విరమణ అవగాహనపై ఒప్పందం కుదర్చుకున్నాయి. ఈ తరుణంలో కాల్పుల విరమణ అవగాహనకు ముగింపు తేదీ లేదని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.

 

Leave A Reply

Your Email Id will not be published!