Rohini Sindhuri : రోహిణి సింధూరి కర్ణాటక రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్పేస్తారు. పేరుకు ఐఏఎస్ అయినా ఎవరికీ తలవంచని తత్వం ఆమెది. జిల్లా కలెక్టర్ గా ఆమె కచ్చితంగా ఉండడం,
ప్రజలకు సేవ చేసేందుకు మక్కువ చూపడంతో పొలిటికల్ లీడర్ల పాలిట ఆమె శాపంగా మారింది.
ఎన్ని వత్తిళ్లు వచ్చినా బెదరని ధైర్యం ఆమె స్వంతం. ప్రస్తుతం కర్ణాటకలోని మైసూర్ నగరానికి డిప్యూటీ కమిషనర్ గా ఉన్నారు.
2017 నుంచి 2019 వరకు మంధ్యా జిల్లా పంచాయతీ శాఖకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పని చేశారు.
2014 నుంచి 2015 దాకా బెంగళూరులోని సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ప్రాజెక్టు, రూరల్ పంచాయతీరాజ్ డిపార్ట్ మెంట్ లో డైరెక్టర్ గా ఉన్నారు.
2013 నుంచి 2014 దాకా తుంకూర్ లోని అర్బన్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ లో కమిషనర్ గా పని చేశారు.
ఇదే ప్రాంతంలో 2012 ఆగస్టు నుంచి ఇదే ఏడాది డిసెంబర్ దాకా అర్బన్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ కు కమిషనర్ గా పని చేశారు.
1984 మే 30న రోహిణి సింధూరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుట్టారు. బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ చేసింది.
ఇండియన్ సివిల్ సర్వెంట్ గా ఉన్నారు. కర్ణాటక స్టేట్ నుంచి ఐఏఎస్ కేడర్ కు ఎంపికైంది.
యూపీఎస్ సీ ఎగ్జామ్స్ దేశ వ్యాప్తంగా నిర్వహిస్తే రోహిణి సింధూరి (Rohini Sindhuri )43వ ర్యాంకు సాధించింది.
2009లో ఐఏఎస్ బ్యాచ్ కు ఎంపికైంది. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న సుధీర్ రెడ్డితో వివాహమైంది.
ఆమెకు ఇద్దరు పిల్లలు. ఆమెకు పలు భాషలు వస్తాయి. ఇంగ్లీష్, తెలుగు, కన్నడ, తమిళ్ భాషలలో అనర్ఘలంగా మాట్లాడగలదు.
జెపీలో సిఇఓగా పని చేసినపుడు ఆమె లక్షా 2 వేల మందికి టాయిలెట్లను నిర్మించింది.
స్వచ్ఛ భారత్ అభియాన్ కింద నెంబర్ వన్ గా నిలిపింది రోహిణి సింధూరి(Rohini Sindhuri ).
దేశంలోనే మూడో ప్లేస్ లో నిలిపేలా చేసింది. 65 కోట్ల ప్రాజెక్టుతో 100నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసింది.
మాంధ్యా జిల్లాలో రైతులను సమీకరించి వారికి మార్కెటింగ్ సౌకర్యం కల్పించింది.
100 మంది రైతులతో సంఘాలు గా మార్చింది. మహిళలు, పిల్లలకు వైద్యంపై అవగాహన కల్పించేలా ఆశా వర్కర్లతో ట్రైనింగ్ ఇప్పించింది.
ప్రతి రోజూ ఉదయమే ఇండ్ల దగ్గరకు వెళ్లడం ఆమె చేసింది.
కర్ణాటక ఫుడ్ అండ్ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్ కు మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. 2017లో రోహిణి సింధూరి హసన్ జిల్లా కలెక్టర్ గా నియమితులయ్యారు.
పొలిటికల్ లీడర్ల వత్తిళ్ల మేరకు ఆమెను బదిలీ చేసింది ప్రభుత్వం. కోర్టును ఆశ్రయించడంతో సర్కార్ పై సీరియస్ అయింది.
దీంతో అప్పటి సీఎం కుమార స్వామి తిరిగి ఆమెను కలెక్టర్ గా నియమించారు.
పొలిటికల్ లీడర్ల కంటే ప్రజలంటేనే ఆమెకు ఇష్టం. ఇటీవల ఆమె వైరల్ గా మారారు.
తన కారు టైరుకు పంక్చర్ అయితే తానే స్టెపినీ పెట్టుకుని మార్చుకున్న ఫోటో నెట్టింట్లో వైరల్ అయింది.
No comment allowed please