హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు లోక్ సభ నియోజకవర్గం కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్ కు బెయిల్ లభించింది. నిన్న ఆయనను ఈగెల్ టీం ఆధ్వర్యంలో పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ ఫామ్ హౌస్ పై దాడి చేశారు. దీంతో పోలీసులపై కాల్పులకు తెగబడ్డారు. ఈగిల్ టీంతో పాటు పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. ఎంపీతో పాటు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కు చెందిన రోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్దనుంచి డ్రగ్స్ తో పాటు పిస్టల్, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలా ఉండగా మొత్తం డ్రగ్స్ పార్టీకి సంబంధించి ఎంపీ, మాజీ ఎమ్మెల్యేతో కలిసి మొత్తం 11 మందిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు ఈగిల్ టీం ఎస్పీ గిరిధర్.
విచిత్రం ఏమిటంటే ఈ డ్రగ్స్ పార్టీలో ఒకే ఒక్క మహిళ ఉండడం ఆశ్చర్యానికి గురి చేసింది. తను ఆర్. ప్రియాంక రెడ్డి అని, ఆమె అడ్రస్ సికింద్రాబాద్ అని ఉందని సమాచారం. ఇందులో బడా కంట్రాక్టర్లు కూడా ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా పార్లమెంట్ సమావేశాలు ఉండడంతో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో పాటు డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ ప్రియాంక రెడ్డి అనే మహిళకు కూడా స్టేషన్ బెయిల్ మంజూరు కావడం విశేషం. అయితే తమకు అందుబాటులో ఉండాలని పుట్టా మహేష్ సహా అర్జున్ రెడ్డి, కౌశిక్ రవిలకు నోటీసులు జారీ చేశారు పోలీసులు. FSI బ్లడ్ రిపోర్ట్ వచ్చేవరకు తమకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కన్స్యూమర్స్ గా ఉన్న తాము 45 రోజులు రిహాబ్ సెంటర్లో ఉంటామని హామీ ఇచ్చారు. మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, నమిత్ మిశ్రాను మిజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు.
