#Hawa : సోష‌ల్ మీడియాదే హ‌వా ప్ర‌పంచం ఫిదా

గ‌త ఏడాది అంతా క‌రోనా దెబ్బ‌కు ప్ర‌పంచం విల‌విల‌లాడితే సోష‌ల్ అండ్ డిజిట‌ల్ మీడియా మాత్రం ఊహించ‌ని రీతిలో త‌మ రేటింగ్ తో..వ్యూయ‌ర్ షిప్ తో దూసుకు పోతున్నాయి. నేరుగా ఆఫీసుల‌కు వెళ్ల‌లేక పోవ‌డం..ఇంటి వ‌ద్దే వుంటూ ప‌ని చేసుకునే వెస‌లుబాటు క‌ల‌గ‌డంతో జ‌నం సామాజిక మాధ్య‌మాల‌లో ఎక్కువ శాతం గ‌డుపుతున్నారు. అదే ప‌నిగా క్లిక్ చేయ‌కుండా..త‌మ‌ను తాము చూసుకోకుండా ఉండ‌లేక పోతున్నారు.

Hawa : గ‌త ఏడాది అంతా క‌రోనా దెబ్బ‌కు ప్ర‌పంచం విల‌విల‌లాడితే సోష‌ల్ అండ్ డిజిట‌ల్ మీడియా మాత్రం ఊహించ‌ని రీతిలో త‌మ రేటింగ్ తో..వ్యూయ‌ర్ షిప్ తో దూసుకు పోతున్నాయి. నేరుగా ఆఫీసుల‌కు వెళ్ల‌లేక పోవ‌డం..ఇంటి వ‌ద్దే వుంటూ ప‌ని చేసుకునే వెస‌లుబాటు క‌ల‌గ‌డంతో జ‌నం సామాజిక మాధ్య‌మాల‌లో ఎక్కువ శాతం గ‌డుపుతున్నారు. అదే ప‌నిగా క్లిక్ చేయ‌కుండా..త‌మ‌ను తాము చూసుకోకుండా ఉండ‌లేక పోతున్నారు. మొద‌ట‌గా చూసేందుకు అల‌వాటు ప‌డిన వారంతా ఇపుడు వాటికే అడిక్ట్ అయిపోయారు. ఒక‌రేమిటి మొత్తం లోకమంతా ఇందులోనే గ‌డుపుతోంది. లైఫ్..జ‌ర్నీ..సంతోషం..ట్రెండింగ్..అప్ డేట్స్..బ్రేకింగ్..ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో..కోట్లాది ప్ర‌జ‌లు వీటినే ఆధారంగా చేసుకుని త‌మ జీవితాలు గ‌డుపుతున్నారంటే ఆశ్చ‌ర్యం వేయ‌క మాన‌దు.
ఫోటోలు..వార్త‌లు..అభిప్రాయాలు..ఆలోచ‌న‌లు..ఫుడ్..ఫ్యాష‌న్..లైఫ్ స్ట‌యిల్..ట్రావెలింగ్..షాపింగ్..దీంతోనే ఉన్న టైంతోనే స‌రిపోతోంది. పిల్ల‌లు, పెద్ద‌లు, యువ‌తీ యువ‌కులు, వృద్ధులు, సెల‌బ్రెటీలు, స్టార్లు, ప్లేయ‌ర్లు, బిజినెస్ టైకూన్లు ఇలా ప్ర‌తి ఒక్క‌రు సోష‌ల్ మీడియా జ‌పం చేస్తున్నారు. క‌ల‌ల బేహారుల్లా త‌యార‌వుతున్నారు. దీనిని తాత్కాలికంగా వాడాల‌ని అదే వ్యాప‌కంగా మారితే మాన‌సికంగా, ఆరోగ్యంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటార‌ని సైకాల‌జిస్టులు, డాక్ట‌ర్లు సూచిస్తున్నారు. వారి సూచ‌న‌ల‌ను వీరు డోంట్ కేర్ అంటున్నారు. ఇక పోతే మారుతున్న టెక్నాల‌జీలో సోష‌ల్ ..డిజిట‌ల్ మీడియానే హ‌వా కొన‌సాగిస్తోంది. ప్ర‌స్తుతం వేలాది సామాజిక మాధ్య‌మాలు వెలుగులోకి వ‌స్తున్నా దిగ్గ‌జ కంపెనీలే త‌మ ఆధిప‌త్యాన్ని కొన‌సాగిస్తున్నాయి. వాటిలో 21 దాకా ఇపుడు లోకాన్ని త‌మ టెక్నాల‌జీతో నివ్వెర పోయేలా చేస్తున్నాయి.
జుక‌ర్ బ‌ర్గ్ నేతృత్వంలోని ఫేస్ బుక్ టాప్ ప్లేస్ లో ఉంటోంది. ఇంట‌ర్నెట్ స‌దుపాయం అందుబాటులోకి రావ‌డంతో ప్ర‌తి ఒక్క‌రు ఉప‌యోగిస్తున్నారు. త‌మ‌కు తాము బ్రాండ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. దీనికి ఎలాంటి ఫీజు ఉండ‌క పోవ‌డం, ఈజీగా పోస్టులు, ఫోటోలు, వీడియోలు, మెస్సేజ్ లు ఏర్పాటు చేసుకునే వీలుండ‌డంతో వ్యూవ‌ర్ షిప్ పెరుగుతోంది. 70 మిలియ‌న్ దాకా బిజినెస్ పేజీలు ఇందులో ఓపెన్ చేసుకున్నారు. లైవ్ స్ట్రీమ్, స్టోరీ మేకింగ్ విత్ ఆడియో , పాట‌లు ఇలా ప్ర‌తిదీ అందుబాటులోకి రావ‌డంతో మీడియా మార్కెట్ లో టాప్ కు ద‌గ్గ‌ర‌లో ఉంది. 94 బిలియ‌న్లు మొబైల్ యాప్ ద్వారా దీనిని యూజ్ చేస్తున్నారు. ఇక రెండో ప్లేస్ లో గూగుల్ అనుబంధ సంస్థ యూట్యూబ్ కొన‌సాగుతోంది. ప్ర‌తి రోజూ ల‌క్ష‌లాది వీడియోలు అప్ లోడ్ అవుతున్నాయి.
ఇటీవ‌ల ట్రాఫిక్ పెర‌గ‌డంతో కొంత సేపు స‌ర్వ‌ర్ ఆగి పోయింది. దీంతో ఒక్క‌సారిగా వ‌ర‌ల్డ్ మొత్తం ఉలిక్కి ప‌డింది. సామాన్యుల‌కు, ఔత్సాహికుల‌కు, లోకాన్ని మెస్మ‌రైజ్ చేయాల‌ని అనుకునే వాళ్ల‌కు ఇది చ‌క్క‌ని వేదిక‌గా ఉప‌యోగ ప‌డుతోంది. ఒక్క రోజులోనే త‌మ క్రియేటీవిటితో లోక‌ల్, గ్లోబ‌ల్ స్టార్లుగా మారిన వారున్నారు. కోట్లాది రూపాయ‌ల ఆదాయం గూగుల్ కు స‌మ‌కూరుతోంది. అంతే కాదు త‌ను లాభం పొందుతూనే త‌న ప్లాట్ ఫాం ద్వారా యూజర్ల‌కు కాసులు కురిపించేలా చేస్తోంది. దీంతో ప్ర‌తి ఒక్క‌రు యూట్యూబ‌ర్లుగా అవ‌తార‌మెత్తుతున్నారు. 1.9 బిలియ‌న్ల కంటే ఎక్కువ‌గా దీనిలో భాగ‌స్వామ్యులుగా ఉన్నారు.
దీనికి పోటీగా ఫేస్ బుక్ టేకోవ‌ర్ చేసుకున్న వాట్స‌ప్ మూడో ప్లేస్ చేజిక్కించుంది. ఇదెప్పుడైతే మార్కెట్ లోకి వ‌చ్చిందో స‌మాచార మార్పిడి అత్యంత సులువుగా మారింది. క్ష‌ణాల్లో ప్ర‌పంచంలో ఎక్క‌డి నుంచైనా న్యూస్, వార్త‌లు, స్టోరీలు, ఫోటోలు..మ్యాప్ లు..మెస్సేజ్ లు పంపించుకునే వీలు క‌ల్పించింది. యూట్యూబ్ కు అతి ద‌గ్గ‌ర‌లో ఉంది. నువ్వా నేనా అన్న రీతిలో కొన‌సాగుతున్నాయి. దీని ద్వారా ఫేస్ బుక్ కు భారీ ఆదాయం స‌మ‌కూరుతోంది. దీని ద్వారా కోట్లాది రూపాయ‌ల బిజినెస్ జ‌రుగుతోంది ప్ర‌తి రోజు. ఇక నాలుగో ప్లేస్ లో ఫేస్ బుక్ కు చెందిన మెస్సెంజ‌ర్ చేరింది. 2011లో దీనిని ఇంట్ర‌డ్యూస్ చేసింది. 1.4 బిలియ‌న్ల‌కు యూజ‌ర్లు చేరుకున్నారు. అడ్వ‌ర్ టైజ్, క్రియేట్ చాట్ బోట్స్, న్యూస్ లెట‌ర్స్ ఇందులో పంపించుకునే వీలుంది.
ఇపుడు డిజిట‌ల్, సోష‌ల్ మీడియాలో మెస్సెంజ‌ర్ కు ప్ర‌యారిటీ పెరుగుతోంది.
ఐదో ప్లేస్ లో వుయ్ చాట్ నిలిచింది. ఈ యాప్ రాకెట్ కంటే వేగంగా దూసుకు పోతోంది. ఆల్ ప్లాట్ ఫాం మీద ప‌నిచేస్తోంది. మెస్సేజ్ లు, వీడియో కాలింగ్ స‌దుపాయం అంద‌జేస్తోంది. కోటి బిలియ‌న్ కు పైగా వాటా ద‌క్కించుకుంది. ఆసియాలో దీని వాడ‌కం ఎక్కువ‌గా ఉంది. సోష‌ల్ మీడియాలో మైక్రోసాఫ్ట్ ఫ్లిక‌ర్ ఎంత పాపుల‌ర్ అయ్యిందో అంత‌కంటే దానిని తోసిరాజ‌ని ఇన్‌స్టాగ్రాం జ‌నాన్ని స‌మ్మోహితుల‌ను చేసింది. నిమిషాల్లో స్టార్లు అయిపోతున్నారు. కోట్ల‌ల్లో ఫాలోవ‌ర్లు ఉంటున్నారు. స్టార్లు, సెల‌బ్రెటీలు, స్పోర్ట్స్ ప‌ర్స‌న్లు ..బిజినెస్, పొలిటిక‌ల్ లీడ‌ర్లు త‌మ‌ను తాము ప్రూవ్ చేసుకుంటున్నారు. ఎంచ‌క్కా డిఫ‌రెంట్ ఫోటోలు, వీడియోలు, మెస్సేజ్‌ల‌తో ఏలుతున్నారు. కూర్చున్న చోటే సంపాదిస్తున్నారు. ఇందులో యూట్యూబ్ లాగే వీడియోలు పోస్టు చేసుకునే స‌దుపాయం ఉండ‌డంతో త‌క్కువ కాలంలోనే పాపుల‌ర్ అయ్యింది.
క్యూక్యూ స్క్రీన్ షాట్ స‌దుపాయం క‌లిగిన సోష‌ల్ మీడియా నెట్ వ‌ర్కింగ్ యాప్. ఇది చైనా కంట్రీకి చెందింది. టాప్ సైట్ల‌లో ఇది అనూహ్యంగా ఏడో స్థానానికి ఎగ‌బాకింది. ప్ర‌పంచ వ్యాప్తంగా 80 దేశాల‌కు విస్త‌రించింది. దీనికున్న ప్ర‌త్యేక‌త ఏమిటంటే ఇత‌ర భాష‌ల్లో కూడా దీనిని వాడుకునే స‌దుపాయం ఉంది. దీంతో దీనికి వ్యూవ‌ర్లు..వాడ‌కందారులు పెరిగారు. ఇప్ప‌టి దాకా 900 మిలియ‌న్ల మంది దీనిని ఉప‌యోగిస్తున్నారు. మెస్సేజ్ లు, అవ‌తార్ క్రియేష‌న్, మూవీస్ చూడ‌టం, ఆన్ లైన్ గేమ్స్ ఆడుకునే వీలు ఉండ‌డం, ఆన్ లైన్ షాపింగ్, బ్లాగ్ రాసే స‌దుపాయం ఉంది. అంతే కాకుండా తాజాగా ఎక్క‌డి నుంచి ఎక్క‌డికైనా డ‌బ్బులు పంపించుకునే వీలుండ‌డంతో దీనికి క్రేజ్ పెరిగింది. వుయ్ చాట్ కంపెనీకి ఇది చెందింది.
నెట్ క‌నెక్టివిటీ క‌లిగిన వారంద‌రికీ తెలిసిన ప‌దం బ్లాగ్. ఒక రకంగా చెప్పాలంటే వెబ్ సైట్ కు ప్ర‌త్యామ్నాయం ఇది. డ‌బ్బులు పెట్టుకోలేని వాళ్ల‌కు ఉచితంగా క‌ల్పించే స‌దుపాయం. దీనిని కూడా తీసి పారేయ‌టానికి వీలు లేదు. దీని ద్వారా డ‌బ్బులు సంపాదిస్తున్న వాళ్లు..లోకంలో పాపుల‌ర్ అయిన వాళ్లు ఎంద‌రో ఉన్నారు. టెక్నాల‌జీలో టాప్ రేంజ్ లో కొన‌సాగుతున్న గూగుల్ బ్లాగ‌ర్ ను డెవ‌ల‌ప్ చేసింది. దీనికంటే ముందు ఎనిమిదో ప్లేస్ లో టంబ్ల‌ర్ నిలిచింది. షేరింగ్ టెక్ట్స్, ఫోటోలు, లింకులు, వీడియోలు, ఆడియోలు, త‌మ అభిప్రాయాల‌ను తెలుసుకునే స‌దుపాయం ఇందులో ఉంది. దీని ద్వారా బ్లాగ్ ఓపెన్ చేస్తే అచ్చంగా వెట్ సైట్ లాగానే అగుపిస్తుంది. ఇదే దీని ప్ర‌త్యేక‌త‌. చైనాకు చెందిన మ‌రో సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ యాప్ క్యూ జోన్. దీనికి 632 మంది మిలియ‌న్లున్నారు.
ప‌దో ప్లేస్ లో ప్ర‌పంచాన్ని ఒక ఊపు ఊపిన యాప్ ఏదైనా ఉందంటే అది టిక్ టాక్. ఇండియా చైనా దేశాల మ‌ధ్య వివాదం కార‌ణంగా ఇక్క‌డ బ్యాన్ చేశారు. దీని ద్వారా టిక్ టాక్ స్టార్లు అయిన వారు ల‌క్ష‌ల్లో ఉన్నారు. వీరికి సినిమా అవ‌కాశాలు అందాయి కూడా. ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రాం తర్వాత ఎక్కువ‌గా డౌన్లోడ్ చేసుకున్న వాటిలో టిక్ టాక్ ఉండ‌డం విశేషం. 11వ స్థానంలో సినా వీబో ఉంది. 12వ ప్లేస్ లో ట్విట్ట‌ర్ ద‌క్కించుకుంది. ఇన్‌స్టంట్ మెస్సేజ్ ల‌తో మ‌రింత పాపుల‌ర్ అయిపోయింది. ఇండియాలో పీఎం మోదీ దీనిని వాడుకున్నంత‌గా ఎవ‌రూ వాడుకోవ‌డం లేదు. బీజేపీ కూడా ఇందులో అగ్ర‌గామిగా ఉంటోంది. 280 ప‌దాల కంటే ఎక్కువ‌గా వాడేందుకు వీలుండ‌దు.
ఇక్క‌డే కొంచెం క‌ష్టం. మ‌రో సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్ రెడ్డిట్ 13వ స్థానంలో ఉండ‌గా చైనాకు చెందిన బైదూ దేబియా 14వ ప్లేస్ తో స‌రి పెట్టుకుంది. 294 మిలియ‌న్ల‌తో అతి పెద్ద సోష‌ల్ మీడియా ప్లాట్ ఫాం గా అవ‌త‌రించింది లింక్డ్ఇన్. ఇది 15వ స్థానంలో ఉండ‌గా 16వ ప్లేస్ లో 260 మిలియ‌న్ల‌తో వైబ‌ర్ నిలిచింది. స్నాప్ చాట్ 255 మిలియ‌న్ల‌తో 17వ స్థానంలో ఉంటే..అతి త‌క్కువ వ్య‌త్యాసంతో పింటారెస్ట్ 18వ ప్లేస్ తో స‌రిపెట్టుకుంది. బిలియ‌నీర్లు, వ్యాపార‌వేత్త‌లు, స్టార్లు, సెల‌బ్రెటీలు దీనిని ఎక్కువ‌గా వాడుతున్నారు. లైన్ 19వ స్థానంలో ఉండ‌గా అనూహ్యంగా టెలిగ్రాం 20వ ప్లేస్ ద‌క్కించుకుంది. ఇక 21వ స్థానంలో ఆన్ లైన్ ప‌బ్లిషింగ్ ప్లాట్ ఫాంతో మీడియం నిల‌వ‌డం విశేషం. మొత్తంగా చూస్తే సెర్చింగ్, టెక్నాల‌జీ ప‌రంగా చూస్తే ఇప్ప‌టికీ గూగుల్ నే టాప్.

No comment allowed please