రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. వైకుంఠపాళిని తలపింప చేసేలా నాయకులు మాటలతో మంటలు సృష్టించేందుకు రెడీగా ఉంటారు. తాము చెప్పిన మాటకు కట్టుబడి ఉండడం, సైద్ధాంతిక సూత్రాలకు, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడిన నాయకులు కొద్ది మంది మాత్రమే అగుపిస్తారు. అటువంటి వారిలో సుందరయ్య, గుమ్మడి నర్సయ్య, జైపాల్ రెడ్డి లాంటి వారిని పేర్కొనవచ్చు. ఈ రంగంలో పదవే పరమార్థం. అధికారంలోకి రావడమే లక్ష్యం. అవినీతి, అక్రమాలు, కేసులు, దోపిడీలు, మర్డర్లు, మానభంగాలు, స్కాంలు ఇలా చెప్పుకుంటూ వెళితే చాంతాడంత అవుతుంది. అందుకే పొలిటికల్ సెక్టార్ లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు అంటూ ఎవరూ వుండరు. అన్నీ తాత్కాలిక సంబంధాలే. ఐదేళ్ల కాలంలో ఎవరు ఏ పార్టీలో ఉంటారో..ఇంకే పార్టీకి చెందిన వారో చెప్పడం కష్టం.
అలా తయారైంది భారతీయ రాజకీయ వ్యవస్థ. సమాజంలో ఉన్న అవలక్షణాలన్నీ ఇందులోకి వచ్చి చేరాయి. దేశానికి మూల స్తంభాలైన న్యాయ వ్యవస్థ ఇందుకు మినహాయింపు ఏమీ కాదు. ఇక్కడ కూడా కుల, మతాలు వచ్చి చేరాయి. అవినీతి ఆక్టోపస్ లా విస్తరించింది. కోట్ల కొద్ది కరెన్సీ నోట్లు మనుషుల్ని మేనేజ్ చేస్తున్నాయి. టెక్నాలజీ మంచి కంటే చెడుకే ఎక్కువగా ఉపయోగ పడుతోంది. నిన్నటి దాకా తమ ప్రాంత ప్రయోజనాలే ముఖ్యమని, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని తూర్పార బట్టిన ప్రముఖ నటుడు కమల హాసన్ ఉన్నట్టుండి తమిళనాడులో త్వరలో జరగనున్న ఎన్నికల వేళ తన స్వరాన్ని మార్చుకున్నారు. ఇపుడిదే ఇండియా వ్యాప్తంగా న్యూస్ హల్ చల్ చేస్తోంది. పవర్ లోకి వచ్చేందుకు ఆయన ఎవరితోనైనా కలిసేందుకు సిద్ధంగా ఉన్నానని ఇప్పటికే ప్రకటించారు.
తాజాగా తలైవా రజనీకాంత్ పార్టీ పెట్టిన వెంటనే తాను మద్ధతు తెలిపేందుకు రెడీ అన్నారు. అలా అన్నారో లేదో ఇలా రజనీకి అనారోగ్యం రావడం..లక్షలాది అభిమానులకు కొత్త ఏడాది మొదట్లోనే చేదు వార్త చెప్పారు. తనకు ప్రజా సేవ కంటే హెల్త్ ముఖ్యమని ప్రకటించారు. ఇక పాలిటిక్ష్ వద్దని సమాజ సేవ చేస్తానని తెలిపారు. ఉన్నట్టుండి కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఒకవేళ ముఖ్యమంత్రిని అయితే..తప్పకుండా కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీతో కలిసి పని చేస్తానని స్పష్టం చేశారు. నిన్నటి దాకా బీజేపీ అంటేనే ఫైర్ అయిన కమల్ ఉన్నట్టుండి స్వరం మార్చడంపై ఇతర పార్టీల నేతలు ఆశ్చర్యానికి లోనయ్యారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం తప్పదని అన్నారు. రాజకీయాల్లో ఇది మామూలేనని విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. కొద్ది కాలం ఆగితే తమిళనాట కుర్చీలాట స్టార్ట్ కావడం ఖాయం. ఈ మ్యూజికల్ చెయిర్ లో ఎవరు కూర్చుంటారనేది అంతు చిక్కని ప్రశ్న.
No comment allowed please