భారతీయ రాజకీయ రంగంలో సమీకరణలు..మార్పులు శరవేగంగా చోటు చేసుకుంటున్నాయి. అటు ఉత్తరాది నుంచి ఇటు దక్షిణాది వరకు..కాశ్మీర్ టు కన్యాకుమారి దాకా కాషాయ జెండా ఎగుర వేయాలన్నది ఇండియన్ ప్రైమ్ మినిష్టర్ మోదీ టార్గెట్. ఆయనకు నమ్మిన బంటు, ట్రబుల్ షూటర్, వ్యూహకర్తగా పేరున్న హోం శాఖా మంత్రి అమిత్ షా దీనిని ఆచరణలోకి తీసుకు వచ్చే పనిలో నిమగ్నమయ్యారు. ఆ మేరకు తన పనిని అంతర్గతంగా ప్రారంభించారు కూడా. సౌత్ లో కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించి కమలానికి పవర్ దక్కేలా చేసిన ఘనత ఆయనదే. ఇక రెండో వికెట్ తెలంగాణ రాష్ట్రం మీద పడింది. ఆ మేరకు దుబ్బాక ఉప ఎన్నిక, జిహెచ్ ఎంసీ ఎన్నికల్లో ఆ ప్రభావం స్పష్టంగా కనిపించింది. నిన్నటి దాకా బీరాలు పలికి..కేంద్రంతో తాడో పేడో తేల్చుకుంటానని చెప్పిన సీఎం కేసీఆర్ ఉన్నట్టుండి మాట మార్చారు.
బీజేపీతో చూసీ చూడనట్టు వ్యవహరించడమే మేలని మౌనం వహించారు. ఇప్పటికే ఇక్కడ బీజేపీ కేసీఆర్ ను టార్గెట్ చేసింది. ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ కు వచ్చిన అమిత్ షా రాష్ట్రంలో జరుగుతున్న అన్ని కార్యక్రమాలపై విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు. దీంతో బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ పెడతానంటూ చెప్పిన గులాబీ బాస్ ఇపుడు ఆ ఊసే ఎత్తడం లేదు. ఏపీలో ఇప్పటికే పలు అవినీతి ఆరోపణలకు సంబంధించి కేసులు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం కాళ్ల బేరానికి వచ్చేలా చేశారు మోదీ అండ్ టీం. అయితే దోస్తీ లేదంటే జైలేనన్న క్యాప్షన్ వీరికి అర్థమయ్యేలా చెప్పడంతో గత్యంతరం లేక పైన మాటలు..లోపట చేతులు కలపడం జరుగుతోంది.
ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్ లో పవర్ లోకి రావాలని కంకణం కట్టుకున్నారు ఈ ట్రబుల్ షూటర్. అక్కడ తృణముల్ కాంగ్రెస్ అధికారంలో ఉంది.
నేను జేజమ్మను..తాను ఎవరి మాట విననంటూ మొండికేసి కూర్చున్న మమతా బెనర్జీని గద్దె దించాలన్నదే షా పట్టుదలతో ఉన్నారు. ఆ మేరకు ఆమెకు అనుంగు అనుచరులుగా ఉన్న వారిని తమ వైపు తిప్పుకునేందుకు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే రైట్ హ్యాండ్ గా ఉన్న కొంత మందిని చేరేలా చేశారు. దీంతో దీదీ ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. ఒకప్పుడు మోదీ గెలుపులో కీలక పాత్ర పోషించిన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ను ఎంగేజ్ చేసుకుంది. మాటలతో కాకుండా చేతలతో విజయపుటంచులకు చేర్చడంలో ఆయన దిట్ట. ఆ మేరకు ఆయన మోదీ పవర్ లోకి వచ్చేలా సాయపడ్డాడు.
ఆ తర్వాత ఏపీలో జగన్ మోహన్ రెడ్డి గెలుపులో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ పేరుతో పశ్చిమ బెంగాల్, తమిళనాడులో పని చేస్తున్నారు. ఇక్కడ దీదీ అక్కడ స్టాలిన్ కు కమిట్ కావడంతో బీజేపీ పీకేను టార్గెట్ చేస్తోంది. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ కిషోర్. అమిత్ షాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. బీజేపీకి బెంగాల్ లో రెండెంకల డిజిట్ సీట్లు కూడా రావంటూ చెప్పారు. దీనిని కమలం లైట్ తీసుకుంది. రాబోయే ఎన్నికలు అటు దీదీకి ఇటు బీజేపీకి పెను సవాల్ గా మారాయి. ఎవరు పవర్ లోకి వస్తారనేది ప్రశ్నార్థకంగా మారినా చివరి వరకు సెంట్రల్ వర్సెస్ స్టేట్ వార్ గా తయారైంది. బెంగాల్ లో దీదీ తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందా లేక బీజేపీ కాషాయా పతాకాన్ని ఎగుర వేస్తుందా అన్నది కాలమే సమాధానం చెబుతుంది.
No comment allowed please