#NAMO : యువతకు మోదీ హితబోధ..ఇండియాకు మీరే బ్రాండ్
NAMO : వంద కోట్లకు పైగా జనాభా కలిగిన భారతదేశానికి రక్తం మరిగిన యువతీ యువకులే కావాలని..ఈ దేశ అత్యున్నత ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యతను తీసుకునేందుకు ముందుకు రావాలని ఇండియన్ ప్రైమ్ మినిష్టర్ దామోదర దాస్ మోదీజీ పిలుపునిచ్చారు. ప్రపంచం అంతా ఒక ఎత్తు..మన దేశం మరో ఎత్తు. శాంతికి ఈ దేశం పెట్టింది పేరు..దానిని కంటిన్యూ చేసేలా..అట్టడుగు స్థాయి నుంచి అత్యున్నతమైన స్థాయికి అందుకునే ప్రతి అవకాశాన్నియువత అందిపుచ్చు కోవాలని కోరారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ మేనేజ్ మెంట్ కు చెందిన విద్యార్థులు లోకల్ నుంచి గ్లోబల్ గా మార్చడంపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు ప్రధానమంత్రి. యువత కలలకు రెక్కలు తొడగాలి. వాటిని సాకారం చేసుకునేందుకు రేయింబవళ్లు శ్రమించాలి.
కష్టాలను దాటుకుని కన్నీళ్లను దాచుకుని లక్ష్యం సాధించేంత దాకా విశ్రమించ రాదని కోరారు. ఒడిషాలోని సంబాళపూర్ లో ఐఐఎం శాశ్వత భవన నిర్మాణానికి వర్చువల్ ద్వారా పీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్య, ఆరోగ్యం, ఉపాధి రంగాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని..ఇందు కోసం దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఆ ఫలాలు అందించే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. ప్రపంచాన్నికమ్ముకున్న కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ఇండియా సక్సెస్ అయ్యిందని, మనం అనుసరించిన విధానాలు, తీసుకున్న నిర్ణయాలను పలు దేశాలు ప్రశంసించాయని మోదీజీ వెల్లడించారు. ప్రాణంతంకంగా తయారైన కరోనా వ్యాధి నివారణకు ఎక్కడా లేని విధంగా మన దేశం అత్యంత చౌక ధరలో ప్రజలకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేసిందన్నారు.
ప్రపంచమంతా మన వైపు చూస్తోందని ఈ క్రెడిట్ అంతా ఈ దేశపు మేధావులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులదేనని కొనియాడారు. టెక్నాలజీ పరంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయని, వాటిని గుర్తించి..గమనించి గ్రామీణ ప్రాంతాలను బలోపేతం చేసేందుకు కావాల్సిన ఉపకరణాలను తయారు చేయాల్సిన బాధ్యత మీ మీదే ఉందని సూచించారు. యువతీ యువకులు ఆదర్శంగా ఉండేలా తమను తాము తీర్చిదిద్దు కోవాలన్నారు. ప్రతిభ ఏ ఒక్కరి స్వంతం కాదని, అది ఒకరు నేర్పితే వచ్చేది కాదన్నారు. సామాజిక, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక రంగాలలో ఇండియా ముందుకు వెళుతోందన్నారు. అన్ని రంగాలను ఒంటి చేత్తో శాసిస్తున్నఐటీ కంపెనీలలో అత్యున్నత స్థానాలలో మన ఇండియన్లే ఉన్నారని గుర్తు చేశారు. సుందర్ పిచ్చయ్, సత్య నాదెళ్ల లాంటి వాళ్లను స్ఫూర్తి తీసుకోవాలని కోరారు.
No comment allowed please