#Komatireddy : కోమటిరెడ్డి అడ్డగింత..కేసీఆర్ పాలనపై ఫైర్
Komatireddy : కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో ఆటవిక, పోలీసుల పాలన నడుస్తోందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన జోష్యం చెప్పారు. కొందరు పనిగట్టుకుని తమ కార్యకర్తలు, నాయకులపై వత్తిళ్లకు గురి చేస్తున్నారని అన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాఘవరెడ్డితో ములాఖత్ అయ్యేందుకు ఆయన బయలు దేరారు. ఇదే సమయంలో ఆయనతో కలవడం కుదరదంటూ పోలీసులు అభ్యంతరం తెలిపారు.
దీంతో వెంకట్ రెడ్డి(TeluguISM Komatireddy) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ కు రోజులు దగ్గర పడ్డాయని ధ్వజమెత్తారు. పూర్తిగా పాలన కంట్రోల్ తప్పిందన్నారు. అక్రమ అరెస్టులకు భయపడేది లేదన్నారు. వత్తిళ్లకు, కేసులకు వెనుదిరిగే ప్రసక్తి లేదని ఎంపీ స్పష్టం చేశారు. పనిగట్టుకుని ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని టార్గెట్ చేస్తున్నారని, వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ పేర్కొన్నారు. ఆయన మరో అడుగు ముందుకేసి ..కేసీఆర్ పాలన కంటే ఆనాటి రజాకర్ల పాలన బాగుండేదన్నారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం మానుకోవాలని సూచించారు.
కేసీఆర్ పతనం మొదలైందని, పోలీసులు, అధికారులు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు టీపీసీసీ అధినేత ఉత్తమ్ కుమార్ రెడ్డి. అధికారం ఏ ఒక్కరి సొత్తు కాదన్నారు. చట్టం ధర్మం రాజ్యాంగానికి లోబడి పని చేయాలని ఆ దిశగా ఏ ఒక్కరు పని చేసిన పాపాన పోలేదన్నారు. రాఘవరెడ్డి ఎదుగుదలను చూసి ఓర్వలేకనే అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపించారని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తే రాబోయే రోజుల్లో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారన్నారు.
No comment allowed please