#JyothyReddy : నిన్న లేబర్..నేడు సిఇఓ..సాధికారతకు దర్పణం
ఒకప్పుడు కూలీగా పనిచేసిన జ్యోతి రెడ్డి ఇపుడు బిగ్గెస్ట్ కంపెనీకి సిఇఓగా ఉన్నారు. ఇది నిజంగా జరిగిన కథ.
కలలు కనండి..వాటిని నిజం చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. పోతే పోయేదేముంది..జస్ట్ కష్టపడటమేగా. అయితే విజయం వరిస్తుంది. కాకపోతే అపజయం నేర్పిన అనుభవం పనికొస్తుంది. కొందరిని చూస్తే జాలేస్తుంది. ఇంకొందరిని చూస్తే గుండెల్లో దాచుకోవాలని అనిపిస్తుంది. ఈ సమాజంలో ఆడవాళ్లంటే చులకన భావం. వాళ్లకు ఏదీ చేతకాదనే కామెంట్స్ ఎక్కువగా వింటూ వుంటాం. కానీ అవేవీ ఆమె విషయంలో అడ్డురాలేదు. తెలంగాణ ప్రాంతానికి చెందిన అనిలా జ్యోతి రెడ్డిది కన్నీటి కథ. అత్యంత పేదరికం నుంచి వచ్చిన ఆమె ఎన్నో కష్టాలను అనుభవించింది. లేబర్‌గా పనిచేసిన ఆమె ఇపుడు ఏకంగా ప్రపంచాన్ని శాసిస్తున్న అమెరికాలో ఏకంగా ఐటీ రంగానికి సంబంధించి కీ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ కంపెనీని ఏర్పాటు చేసింది. ఒకప్పుడు కూలీగా పనిచేసిన జ్యోతి రెడ్డి ఇపుడు బిగ్గెస్ట్ కంపెనీకి సిఇఓగా ఉన్నారు. ఇది నిజంగా జరిగిన కథ.
ఎందరికో స్ఫూర్తి దాయకంగా నిలిచిన ఆమె జీవితం ప్రతి ఒక్కరికి పాఠం కావాలి. ఐదుగురు పిల్లలు కలిగిన ఆ కుటుంబంలో ఎనిమిదేళ్లప్పుడు పేరెంట్స్ బతుకు భారం ఎక్కువై జ్యోతిరెడ్డిని అనాధ ఆశ్రమంలో చేర్పించారు. చిన్నప్పుడే పెళ్లి చేశారు. కూలీ పనిచేసుకుంటూనే తనను తాను ప్రూవ్ చేసుకుంది. ఏదో ఒకరోజు ఈ ప్రపంచం నివ్వెర పోయేలా చేయాలన్నది ఆమె సంకల్పం. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా రెండు మూడుసార్లు ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం కూడా చేసింది. కనీసం తిండికి కూడా ఉండని దుస్థితి. వీటన్నింటిని ఆమె తట్టుకుని నిలబడింది. కుటుంబం కోసం మళ్లీ బతకాలని అనుకున్నది. జీవితం నేర్పిన పాఠం తిరిగి బతికేలా చేసింది. తన భర్త కూడా కేవలం పదో తరగతి చదవడం. అది కూడా బతికేందుకు దోహద పడక పోవడం కూడా ఆమెను భిన్నంగా ఆలోచించేలా చేసింది. ఆ తర్వాత కాలానికి ఎదురీదింది.
మెల మెల్లగా పనిలోనే నిమగ్నమైంది. ఇపుడు కంపెనీ ద్వారా వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని అనాధ ఆశ్రమాలకు అందజేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతిలో ఎక్కువ మార్కులు వచ్చిన పేద పిల్లలకు పది వేల రూపాయల చొప్పున సహాయం కూడా చేస్తోంది. రాత్రిపూట నెహ్రూ యువక కేంద్రంలో టీచర్ గా పనిచేసింది ఆమె. చేయని పనంటూ ఆమె జీవితంలో లేదు. ఉమ్మడి కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు. అయినా వీటన్నింటిని తట్టుకుని నిలబడింది. ఆత్మ విశ్వాసం సడలకుండా కష్టపడుతూ ఉన్నత స్థాయికి చేరుకుంది. వరంగల్ జిల్లాకు చెందిన జ్యోతి రెడ్డి ఇపుడు ఓ సెన్సేషన్. తనతో పాటు చెల్లెలను కూడా ఆర్ఫన్ హౌస్ లో పదో తరగతి దాకా చదువుకున్నారు. హాస్టల్‌లో ఉన్నప్పుడే ఇంటర్ చదవాలనే కోరిక. ఒకేషనల్ కోర్సు చదివారు. అమ్మ వాళ్ల అన్న కొడుకు వ్యవసాయం చేస్తున్న అతడితో పెళ్లి కుదిర్చారు. అత్తారింట్లో ఇద్దరు ఆడపడుచులు. చిన్నప్పుడే పెళ్లి..ఇద్దరు పిల్లలు. కటిక దరిద్రం.
ఇంతేనా జీవితం అనుకుంటూ బాధ పడింది. హన్మకొండ హాస్టల్‌లో ఉండడం ఎంతో నేర్పింది. రెడ్డి ఫ్యామిలీలో కొందరు పొలాలకు వెళతారు. కొందరు వెళ్లరు. తాను కూడా కూలీకి వెళ్లింది. పొలం పని చేసేటప్పుడు లక్ష్మమ్మ నేర్పించింది. బాగాకష్టమైనప్పుడు..చేతులకు బొబ్బలు వచ్చినప్పుడు చెట్టు కింద కూర్చుని ఏడ్చింది. అయినా నేను ఓడి పోలేదు. నిలబడింది..గెలిచింది. ఎందరికో స్ఫూర్తి దాయకంగా నిలిచింది జ్యోతి రెడ్డి. రాత్రి బడి టీచర్ గా పనిచేసేటప్పుడు నెలకు 120 రూపాయల జీతంతో పనిచేసింది. ఒక ఏడాది పాటు పనిచేసింది. నేషనల్ సర్వీస్ వాలంటీర్ జాబ్‌కు అప్లయి చేసుకుంది. ఊళ్లు తిరుగుతూ మహిళా మండలిని ఏర్పాటు చేయాలి. ఒక్కోసారి రాత్రి 9 గంటలు అయ్యేది. నెలకు 200 రూపాయల జీతం.
ఇంకేమన్న పని చేసుకుంటూ హన్మకొండ పోదామని డిసైడ్ అయ్యింది. కేవలం 110 రూపాయలతో బయలు దేరాం. ఇద్దరు పిల్లలతో వెళ్లాం. పల్లెటూళ్లలో పరువుకు ఎక్కువ విలువ ఇస్తరు. సుబేదారిలో కిరాయి 60 రూపాయల అద్దె. ఉన్న బంగారం అమ్ముకుని..ఇంటి పక్కనే ఉన్న టైప్ రైటింగ్ ఇనిస్టిట్యూట్‌లో టైపింగ్ నేర్చుకుంది. ఒకేషనల్ కుట్టు మిషన్ ప పట్టుండడంతో ఫ్రెండ్ దగ్గర కుట్టే పనికి కుదిరింది. నెలకు 500 సంపాదించేది. ఓపెన్ యూనివర్శిటీ బిఏలో జాయిన్ అయ్యింది. 320 రూపాయల ఫీజు. ఆర్ట్స్ కాలేజీలో ఆదివారం క్లాసుకు అటెండ్ అయ్యేది. క్రాఫ్ట్ టీచర్ గా దరఖాస్తు చేసుకుంది. 1992లో స్పెషల్ టీచర్ గా ఎంపికైంది. తెలవని ఊరు..తెలవని దేశం వెళ్లింది. 1998లో పాస్ పోర్ట్ అప్లయి చేసుకుంది. ఇసిఐఎల్‌లో కంప్యూటర్ కోర్సు నేర్చుకుంది. కజిన్ వెంట అమెరికా వెళ్లింది. సమాచారాన్ని తెలుసు కోవడం. ఇండియాలో ఉన్నంత ఫ్రీ నెస్ అమెరికాలో ఉండదు.
న్యూ జెర్సీలో పేయింగ్ గెస్ట్ గా ఉంది. మూవీ షాప్‌లో పనిచేసింది. సుధీర్ అనే అబ్బాయి నన్ను చూసి సాఫ్ట్ వేర్ కంపెనీలో చేస్తారా అని అడిగారు. టీచర్ జాబ్ చేశారు కదా ట్రైనింగ్ ఇస్తే నేర్చుకోవచ్చని చెప్పారు. రిక్రూటర్‌గా ఎంపిక అయ్యారు. విజిటింగ్ వీసా మీద వెళ్లారు. ఎక్స్ టెన్షన్ చేసుకుంటూ వెళ్లారు. ఐసిఐసిఐ కంపెనీ సపోర్ట్ తో గుడ్ పొజిషన్ దక్కింది. హెచ్ 1 కూడా వచ్చింది. ఇదే అనుభవం నేర్పిన పాఠంతో కీ సాఫ్ట్ వేర్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఆమె తన జీవితానుభవాలను అక్షరబద్దం చేశారు. అదే నేను ఓడి పోలేదు..పుస్తకంగా వచ్చింది. ఎన్నో అవార్డులు, పురస్కారాలు అందుకున్నారు. ఒక పల్లెటూరు నుంచి ప్రపంచం తన వైపు చూసేలా చేసుకున్న ఆమె ప్రయత్నం ప్రతి ఒక్కరికి పాఠం కావాలి. ఈ సక్సెస్ జర్నీ అన్నది ఎందరికో ఆదర్శం కావాలి. మహిళా సాధికారతకు జ్యోతి రెడ్డి ఓ ఐకాన్.
No comment allowed please