#FasttagTollGate : వాహ‌న‌దారులు పారా హుషార్..స‌ర్కార్ గుడ్ న్యూస్

ఏ మాత్రం చిన్న ప్ర‌మాదం చోటు చేసుకున్నా ఇక వాహ‌న‌దారులు ప్ర‌త్య‌క్ష న‌ర‌కాన్ని అనుభ‌విస్తున్నారు. కార‌ణం ఏమిటంటే కంపెనీల ఆధీనంలో 20 ఏళ్ల‌కు పైగా అంటే వారు పెట్టిన పెట్టుబ‌డి, ఆదాయం రాబ‌ట్టుకునేంత దాకా స‌ర్కార్ బ‌డా బాబుల‌కు లీజుకు ఇచ్చింది. టోల్ గేట్ల‌ను ఏర్పాటు చేసి..ద‌ర్జాగా త‌మ‌కు న‌చ్చిన‌ట్లు ఫీజులు వ‌సూలు చేస్తున్నారు. ఈ గ‌లీజు దందాపై అటు వాహ‌న‌దారులు ఇటు ప్ర‌యాణికులు అరిచినా ప‌ట్టించుకునే నాథుడే క‌రువ‌య్యాడు.

దేశంలోని వివిధ జాతీయ ర‌హ‌దారుల‌పై ప్ర‌తి రోజూ ల‌క్ష‌లాది వాహ‌నాలు రాక పోక‌లు సాగిస్తుంటాయి. ఎక్కువ‌గా కాశ్మీర్ టు క‌న్యాకుమారి వ‌ర‌కు ఈ ర‌ద్దీ ఎక్కువ‌గా ఉంటోంది. గ‌తంలో ఆర్థిక స‌ర‌ళీకృత విధానాల కార‌ణంగా ర‌హ‌దారుల అభివృద్ధికి ప్ర‌పంచ బ్యాంకు స‌హ‌కారం అంద‌జేసింది. ఇక ఇండియాలో ర‌హ‌దారుల నిర్మాణాల‌ను బ‌డా కంపెనీలు చేజిక్కించుకున్నాయి. ఆ మేర‌కు కోట్లాది రూపాయ‌ల నిధుల‌ను ఖ‌ర్చు చేశారు. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం ర‌హ‌దారుల అభివృద్ధి కోసం త‌న వంతు సాయం చేస్తోంది. అయినా ఇంకా దేశంలోని ప‌లు ప్రాంతాల‌కు ర‌హ‌దారి సౌక‌ర్యం క‌ష్టంగా ఉంది. ఈ దేశంలో ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల కంటే 90 శాతానికి పైగా గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. ఇప్ప‌టికీ రోడ్లు లేక పోవ‌డంతో ఆటోలు, ఇత‌ర వాహ‌నాల ద్వారానే నిత్యం ప్ర‌యాణం చేస్తుంటారు. ర‌హ‌దారుల‌కు సంబంధించి ల‌క్ష కోట్ల‌కు పైగా కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్రైవేట్ కంపెనీల‌కు బాకీ ప‌డ్డాయి.
వీటికి డ‌బ్బులు చెల్లించాలంటే ఇప్ప‌టికే క‌రోనా కార‌ణంగా ఖ‌జానాలు ఖాళీ అయ్యాయి. ఏ మాత్రం చిన్న ప్ర‌మాదం చోటు చేసుకున్నా ఇక వాహ‌న‌దారులు ప్ర‌త్య‌క్ష న‌ర‌కాన్ని అనుభ‌విస్తున్నారు. కార‌ణం ఏమిటంటే కంపెనీల ఆధీనంలో 20 ఏళ్ల‌కు పైగా అంటే వారు పెట్టిన పెట్టుబ‌డి, ఆదాయం రాబ‌ట్టుకునేంత దాకా స‌ర్కార్ బ‌డా బాబుల‌కు లీజుకు ఇచ్చింది. టోల్ గేట్ల‌ను ఏర్పాటు చేసి..ద‌ర్జాగా త‌మ‌కు న‌చ్చిన‌ట్లు ఫీజులు వ‌సూలు చేస్తున్నారు. ఈ గ‌లీజు దందాపై అటు వాహ‌న‌దారులు ఇటు ప్ర‌యాణికులు అరిచినా ప‌ట్టించుకునే నాథుడే క‌రువ‌య్యాడు. కేంద్రంలోని బీజేపీ స‌ర్కార్ పేద‌ల బాగోగుల కంటే వ్యాపారుల ప్ర‌యోజ‌నాల‌కే పెద్ద పీట వేస్తోంది. ప్ర‌తి ఏటా ఆయా కంపెనీలు, సంస్థ‌లు త‌మ‌కు తోచిన రీతిలో పెంచుకుంటూ పోతున్నారు.
ఎక్క‌డికైనా దూర ప్ర‌యాణం చేయాలంటే జేబులు ఖాళీ అవుతున్నాయి. గ‌త్యంత‌రం లేని ప‌రిస్థితుల్లో జ‌ర్నీ చేస్తున్నారు. మిగ‌తా అధిక శాతం జ‌న‌మంతా బ‌స్సులు, రైళ్ల‌ల్లో ప్ర‌యాణం సాగిస్తున్నారు. ఇంకొంద‌రు అటు ఇటూ కొంత ఛార్జీలు అధిక‌మైనా స‌రే ..ఈ ఇబ్బంది ఎందుక‌ని ఎంచ‌కా గాలిమోటార్లు ఎక్కుతున్నారు. దేశంలోని ప్ర‌ధాన ర‌హ‌దారుల‌న్నీ వాహ‌నాల‌తో కిట‌కిట‌లాడుతున్నాయి. దీంతో కిలోమీట‌ర్ల మేర నిలిచి పోతున్నాయి. అంతే కాకుండా ఎక్క‌డి నుంచి ఎక్క‌డికైనా స‌రే డ‌బ్బులు లేకుండా ఒకే సారి చెల్లిస్తే ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాహ‌నాలు వెళ్లేందుకు కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. ఇందు కోసం టెలికాం కంపెనీల‌కు ల‌బ్ధి చేకూర్చేలా ఉందే త‌ప్ప త‌మ‌కు లాభ‌మేమీ లేదంటున్నారు వాహ‌న‌దారులు.
టోల్ గేట్ల వ‌ద్ద నిరీక్షించ లేమంటూ పెద్ద ఎత్తున విన‌తులు ప్ర‌భుత్వానికి అందాయి. దీంతో ఇబ్బందులు గ‌మ‌నించిన స‌ర్కార్ వాహ‌న‌దారుల‌కు గుడ్ న్యూస్ తెలిపింది. గ‌తంలో జ‌న‌వ‌రి 1 నుంచి ఫాస్ట్ టాగ్ ను త‌ప్ప‌ని స‌రి చేస్తూ తీసుకున్న నిబంధ‌న‌ల‌ను మ‌రోసారి స‌వ‌రించింది. టాగ్ ను ఉప‌యోగించి జాతీయ ర‌హ‌దారుల‌పై టోల్ ఛార్జీలు వ‌సూలు చేసేందుకు గ‌డువును కేంద్ర రోడ్డు ర‌వాణా . ర‌హ‌దారి మంత్రిత్వ శాఖ పొడిగించింది. వ‌చ్చే నెల 15 వ‌ర‌కు డెడ్ లైన్ విధించింది. అంత వ‌ర‌కు డ‌బ్బులు చెల్లించి ప్ర‌యాణం చేయొచ్చ‌ని ఆ మేర‌కు అన్ని కంపెనీల‌కు ఆదేశాలు జారీ చేసింది. డిజిట‌ల్, ఐటీ ఆధారిత టోల్ ఫీజుల చెల్లింపు విధానాల‌ను ప్రోత్స‌హించేందుకు ఫాస్ట్ టాగ్ ను తీసుకు వ‌చ్చామంటోంది స‌ర్కార్. కొత్త ఏడాదిలో కొంచెం వెస‌లుబాటు క‌ల‌గ‌డంతో వాహ‌నదారులు ఊపిరి పీల్చుకున్నారు.

No comment allowed please