#ArjunTendulkar : అర్జున్ టెండూల్కర్ ఆగయా..అభిమానుల ఆనందం
ప్రపంచ క్రికెట్ దిగ్గజ ఆటగాడిగా పేరొందిన భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, ప్రముఖ ప్లేయర్ ముంబయికి చెందిన రమేష్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ జాతీయ జట్టుకు త్వరలోనే ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే దేశీవాలి క్రికెట్ లో పాల్గొంటున్నాడు. తన తండ్రి నుంచి వచ్చిన వారసత్వాన్ని అర్జున్ టెండూల్కర్ కొనసాగిస్తున్నాడు.
ప్రపంచ క్రికెట్ దిగ్గజ ఆటగాడిగా పేరొందిన భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, ప్రముఖ ప్లేయర్ ముంబయికి చెందిన రమేష్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ జాతీయ జట్టుకు త్వరలోనే ఆడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే దేశీవాలి క్రికెట్ లో పాల్గొంటున్నాడు. తన తండ్రి నుంచి వచ్చిన వారసత్వాన్ని అర్జున్ టెండూల్కర్ కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే భారతీయ క్రికెట్ పెద్దల నుండి పలు ప్రశంసలు అందుకున్న ఈ వర్ధమాన ఆటగాడికి క్రికెట్ ఆటలో మంచి భవిష్యత్ ఉందని పేర్కొనడం అభిమానులను ఆనందంలో ముంచెత్తేలా చేసింది. ఇక టెండూల్కర్ అంటేనే ఇండియన్ క్రికెట్ లో ముఖ్యంగా ప్రపంచ క్రికెట్ ఆటలో ఓ వండర్. ఏ ఆటగాడు అందుకోలేని రికార్డులు, అవార్డులను స్వంతం చేసుకున్న ఘనత అందరూ ముద్దుగా పిలుచుకునే సచిన్‌కే దక్కింది.
ఇండియా జట్టకు వెన్నుముకలాగా ఉన్నాడు. వేలాది పరుగులు చేశాడు. జట్టు క్లిష్ట సమయంలో ఉన్నప్పుడు గట్టెక్కించాడు. జాతి ప్రయోజనాలనకు భంగం వాటిల్లకుండా తనదైన శైలితో ఆడడం మొదలు పెట్టాడు. తన దృష్టి అంతా క్రికెట్ మీదే ఉందని, తన తండ్రి కలను తాను నెరవేర్చడంలో సఫలమైనట్టు భావిస్తున్నట్లు ఓ సందర్భంలో ప్రపంచ మీడియాకు వెల్లడించాడు టెండూల్కర్. కాగా తాజాగా ప్రపంచాన్ని విస్మయ పరిచేలా చేసిన ఓ సంఘటన చోటు చేసుకుంది.
అది ఏమిటంటే అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా అత్యధికంగా నివసించే ప్రవాస భారతీయులను ఉద్ధేశించి మాజీ అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగించారు. ఆయన ప్రత్యేకించి సినిమాలో కండల వీరుడు సల్మాన్ ఖాన్, కోహ్లి, టెండూల్కర్ పేర్లను ప్రస్తుతించారు. అంటే టెండూల్కర్ పనితనం, ప్రతిభ ప్రపంచాన్ని ఎంతగా ప్రభావితం చేసిందో అర్థం చేసుకోవచ్చు. తన కుమారుడు కష్టపడి పైకి రావల్సిందేనని, విజయానికి, టాలెంట్ కు దగ్గరి దారులంటూ ఏవీ ఉండవని సచిన్ స్పష్టం చేయడం గమనార్హం.
ఏ మాత్రం ప్రమోట్ చేసినా అర్జున్ టెండూల్కర్ ఇండియన్ క్రికెట్ టీంలో చోటు సంపాదించేవాడు. కానీ అలా జరగలేదు. అంటే అర్థం క్రికెట్ పట్ల సచిన్ కు ఉన్న నిబద్ధత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇక అర్జున్ టెండూల్కర్ విషయానికి వస్తే..తొలిసారిగా ముంబై సీనియర్ క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. త్వరలో ప్రారంభమయ్యే దేశీవాళీ క్రికెట్ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ టి20 కోసం 22 మంది సభ్యులతో ఎంపిక చేసిన జట్టులో అర్జున్ కు చోటు లభించింది. ఈ మేరకు ముంబై క్రికెట్ సంఘం అతడిని ప్రమోట్ చేసింది. ఇప్పటి దాకా ముంబై తరపున అండర్ 14, 16, 19 టోర్నీలలో అర్జున్ పాల్గొన్నాడు. మొదటిసారిగా సీనియర్లతో కలిసి ఆడనున్న అర్జున్ కు సీనియర్ క్రికెటర్లు గుడ్ లక్ చెబుతున్నారు. అయితే ముంబై జట్టుకు సూర్యకుమార్ యాదవ్ సారథ్యం వహిస్తుండడం విశేషం.
No comment allowed please