#PrakashRaj : ప్రకాశ్ రాజ్ బతుకు పోరులో ధిక్కార స్వరం
నటుడు ప్రతిభావంతుడు విశిష్ట విభిన్నమైన వ్యక్తి
Prakash Raj : దేశం మెచ్చిన నటుడు. దర్శకుడు. నిర్మాత. స్పీకర్. రచయిత. అనలిస్ట్. అద్భుతమైన స్పీకర్. ఎప్పుడూ వార్తల్లో నిలిచే వ్యక్తి. అయిదు భాషల్లో ఘంటాపథంగా మాట్లాడగలిగిన వ్యక్తి. వీటన్నింటికంటే కళాకారుడు. ఎక్కడ సమస్య తీవ్రమైతే అక్కడ ప్రజల పక్షాన నిలబడి మాట్లాడే దమ్మున్న మేధావి అతడే అందరికీ ఇష్టుడైన విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్(Prakash Raj ). ఆయన ఏది మాట్లాడినా అదో సంచలనం. అంతగా పాపులర్ అయ్యాడు. బెంగళూరులో 1965 మార్చి 26న జన్మించారు.
టెలివిజన్ ప్రజెంటర్‌గా పేరొందారు. కన్నడ టెలివిజన్ పరిశ్రమలో పనిచేసిన ప్రకాశ్(Prakash Raj )రాజ్ ఐదేళ్ల పాటు కన్నడ సినిమా రంగంలో నటుడిగా ప్రూవ్ చేసుకున్నారు. హిందీ సినిమాల్లో రాణించారు. రంగస్థల నాటకాల్లో వేషాలు వేస్తూ 300 రూపాయల సంపాదించాడు. బెంగళూరులో కళాభిమానులకు స్వర్గధామంగా ఉన్న కళాక్షేత్ర థియేటర్లో 2000 నాటకాలను ప్రదర్శించారు. ప్రకాశ్ రాజ్ కెరీర్లో ఇదో రికార్డు.
అనుకోకుండా తమిళ దర్శకుడు కె. బాలచందర్ దృష్టిలో పడ్డాడు. 1994లో డ్యూయెట్ సినిమాలో ఓ వేషాన్ని ఇచ్చారు. ఇది కమర్షియల్‌గా సక్సెస్ అయింది. పలు హిందీ సినిమాల్లో నటించారు. మాతృభాష కన్నడ అయినప్పటికీ ప్రకాష్ రాజ్‌కు పలు భాషలపై మంచి పట్టుంది. తమిళ్, తెలుగు, మళయాళం, మరాఠి, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్ఘలంగా మాట్లాడతారు. పలు పాత్రల్లో నటించి జీవం పోశారు ప్రకాశ్ రాజ్. తండ్రిగా, విలన్‌గా ఆయన మెప్పించారు.
జాతీయ స్థాయిలో పలు అవార్డులు అందుకున్నారు. మణిరత్నం డైరెక్షన్లో వచ్చిన ఇరువార్, కృష్ణవంశీ దర్శకత్వంలో తెలుగులో వచ్చిన అంతఃపురం, ప్రియదర్శన్ డైరెక్షన్లో వచ్చిన కాంచీవరం సినిమాలకు గాను అవార్డులు పొందారు. తాను నిర్మాతగా నిర్మించిన కన్నడ సినిమా పుట్టకన్న హైవే నేషనల్ ఫిల్మ్ అవార్డు..బెస్ట్ ఫీచర్ ఫిల్మ్‌గా పురస్కారం దక్కించుకున్నారు.
ప్రకాశ్‌రాజ్ (Prakash Raj )అన్న ప్రసాద్ రాజ్ కూడా నటుడే. 1994లో లలితకుమారిని పెళ్లి చేసుకున్నారు. ఆయనకు ముగ్గురు పిల్లలు. 2009 లో విడాకులు తీసుకున్నారు. 2010లో కొరియోగ్రాఫర్ పోనీ వర్మను మ్యారేజ్ చేసుకున్నారు. తండ్రి పాత్రలో ఆయన నటించిన బొమ్మరిల్లు సినిమాతో ప్రతి తెలుగు వారి లోగిళ్ల హృదయాలను కొల్లగొట్టారు. పోకిరిలో మహేష్ బాబుతో విలన్‌గా నటించి మెప్పించారు.
ప్రధాన భాషలన్నింటిలో నటించారు ఆయన. అతఃపురంలో విశ్వరూపం ప్రదర్శించారు. కమల్ హాసన్‌తో కలిసి తూంగా వనం సినిమాలో ఆకట్టుకున్నారు. నాను నాను కనసు అనే కన్నడ సినిమాకు దర్శకత్వం వహించారు. తమిళ్, తెలుగు భాషల్లో వచ్చిన ధోనీ సినిమాను కూడా ఆయనే డైరెక్టర్. ప్రకాశ్ రాజ్ నటుడే కాదు సామాజిక సేవకుడు కూడా. కరవు ప్రాంతానికి కేరాఫ్‌గా మారిన ఉమ్మడి పాలమూరు జిల్లా కేశంపేట మండలంలోని కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకున్నాడు.
ఎంత విలక్షణ నటుడో అంత కాంట్రోవర్షల్ కూడా. తెలుగు సినిమా నిర్మాతలను తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆరు నెలల పాటు నిషేధానికి గురయ్యారు. ప్రిన్స్ మహేష్‌బాబు నటించిన తొమ్మిది సినిమాల్లో ప్రకాశ్ రాజ్ కీలకమైన పాత్రలు పోషించారు. జూనియర్ ఎన్టీఆర్, బన్నీ,పవన్ కళ్యాణ్ లాంటి అగ్ర నటులతో కలిసి నటించారు.
దేశ వ్యాప్తంగా బీజేపీ సర్కార్‌పై, పీఎం మోడీపై ..మతోన్మాదులపై ..సామాజిక సమస్యలపై..ప్రకాశ్ రాజ్ బహిరంగంగానే నిలదీశారు. ప్రశ్నించే స్వేచ్ఛ లేకుండానే పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కమలనాధులు వచ్చాక బహిరంగ హత్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. బెంగళూరులో గౌరీ లంకేష్ ను చంపడాన్ని ఆయన బహిరంగంగా నిలదీశారు.
నిగ్గదీసి అడగక పోతే చనిపోతామని ..అందుకే ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీని మెచ్చుకుంటూనే..కేసీఆర్‌ను ప్రశంసించడం ప్రకాశ్ రాజ్‌కు మాత్రమే చెల్లింది. త్వరలోనే తెలుగులో తన అనుభవాలతో కలిసిన పుస్తకాన్ని త్వరలోనే రిలీజ్ చేస్తానని ఇటీవల వెల్లడించారు.
సౌకర్యవంతమైన జీవితం..లెక్కలేనన్ని డబ్బులు..సంపాదించే సత్తా..ఊహించని బ్రాండ్ కలిగిన ఈ విలక్షణమైన నటుడు ఈ దేశంలో ప్రతిభావంతమైన కొద్దిమందిలో ఒకడు. అతడిని అర్థం చేసుకుందాం. ఆయన లేవనెత్తిన ప్రశ్నల గురించి ఆలోచిద్దాం.
No comment allowed please