Coach Langer: ఆసిస్, టీమిండియా జట్ల మధ్య మాటలు పరిమితులు దాటుతున్నాయి. నిన్నటి దాకా జాతి వివక్ష వ్యాఖ్యలతో క్రికెట్ లోకాన్నివిస్మయానికి గురి చేసిన ఆసిస్ ఆటగాళ్లు నిరసనలు తలెత్తడంతో తమను క్షమించమంటూ కోరారు. ఆ వివాదం మరిచి పోక ముందే, నాల్గో టెస్ట్ ఆడాల్సిన సమయంలో ఉన్నట్టుండి మరో బాంబు పేల్చాడు ఆస్ట్రేలియా కోచ్ జస్టిస్ లాంగర్. ఇండియన్ ప్రిమియర్ లీగ్ వల్లనే ఆటగాళ్లు తరుచూ గాయాల పాలవుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఎప్పటి లాగే జరిగే ఐపీఎల్ గత ఏడాది కరోనా వల్ల ఆలస్యంగా ప్రారంభించడంతో తరుచూ ప్లేయర్లు గాయాలతో సతమతమవుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తాను ఐపీఎల్ నిర్వహణను తప్పు పట్టడం లేదని , కేవలం ఆ టోర్నీ ప్రారంభించిన సమయాన్ని మాత్రమే తప్పు పడుతున్నట్లు వివరణ ఇచ్చాడు లాంగర్. మొదటి టెస్టు ఆసిస్ గెలిస్తే రెండో టెస్ట్ లో ఇండియా ఘన విజయాన్ని నమోదు చేసుకుంది.
మూడో టెస్టు మాత్రం నువ్వా నేనా అన్న రీతిలో సాగింది. ఆఖరు రోజు టెస్ట్ మ్యాచ్ వన్డే మ్యాచ్ ను తలపించింది. ఆసిస్ గెలుస్తుందని అనుకున్న సమయంలో విహారి, రవిచంద్రన్ లు అడ్డు పడడంతో ఆసిస్ కల నెరవేరలేదు. ఈ టెస్టు అనంతరం కోచ్ లాంగర్ వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడాడు. ఇరు జట్ల మధ్య జరుగుతున్న సిరీస్ నాకు విచిత్రంగా కనిపిస్తోంది.
వన్డే సిరీస్‌తో ప్రారంభమైన గాయాల బెడద ఇంకా కొనసాగుతూనే ఉందన్నారు. తొలుత తమ జట్టు ప్లేయర్లు గాయపడితే, ఇపుడు ఇండియా వంతు వచ్చిందన్నారు. మొత్తం మీద కోచ్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. లాంగర్ వ్యాఖ్యలపై ఇండియన్ అభిమానులు కారాలు మిరియాలు నూరుతున్నారు.
No comment allowed please