#VivoY12S : వివో 12 ఎస్ ధ‌ర త‌క్కువ ఫీచ‌ర్లు ఎక్కువ‌

10 వేల లోపు ఫోన్ కావాలంటే బెస్ట ఆప్ష‌న్

Vivo Y12S : ఇండియ‌న్ మార్కెట్ ను చైనా కంపెనీలే శాసిస్తున్నాయి. షియోమీ, పోకో, వివో, రియ‌ల్ మి, ఒప్పో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్మార్ట్ ఫోన్ల కంపెనీలు త‌మ ఉత్ప‌త్తులతో మొబైల్ ల‌వ‌ర్ల‌ను ఒక చోట ఉండ‌నీయ‌డం లేదు. తాజాగా చైనాకు చెందిన వివో ఇండియ‌న్ల‌ను దృష్టిలో పెట్టుకుని బ‌డ్జెట్ ధ‌ర‌లో ఫోన్ తీసుకు వ‌చ్చింది. డ్యూయ‌ల్ కెమెరాలు, 5000 ఎంఏహెచ్ బ్యాట‌రీ స‌పోర్ట్ తో వివో వై 12 ఎస్ పేరుతో భార‌త్‌లో లాంఛ్ చేసింది వివో కంపెనీ.#Vivi

వాట‌ర్ డ్రాప్ త‌ర‌హా డిస్ ప్లే లాంటి త‌దిత‌ర అదిరి పోయే ఫీచ‌ర్ల‌తో తీసుకు వ‌చ్చింది. సింగిల్ వేరియంట్ లో వివో వై 12 ఎస్ ల‌భ్య‌మ‌వుతుంది. ఆన్ లైన్ లో ఇటు ఆఫ్ లైన్ లో కూడా దీనిని అందుబాటులోకి తెచ్చారు. 3 జీబీ + 32 జీబీ స్టోరేజీ వేరియంట్ తో వచ్చిన ఈ ఫోన్ ధ‌ర‌ను 9990 రూపాయ‌లుగా నిర్ణ‌యించింది. ఈ స్మార్ట్ ఫోన్ ఫాంట‌మ్ బ్లాక్, గ్లేసియ‌ర్ బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో ల‌భిస్తుంది.

వివో ఇండియా స్టోర్, అమెజాన్, ఫ్లిప్ కార్ట్, పే టీఎం, టాటా క్లిక్ తో పాటు దేశంలోని ఇత‌ర పార్ట‌న‌ర్‌షిప్ రిటైల్ దుకాణాల ద్వారా ల‌భించేలా ఏర్పాట్లు చేసింది వివో. ఇక ఫోన్ విష‌యానికి వ‌స్తే 6.51 అంగుళాల హెచ్‌డి డిస్ ప్లే, 720- 600 పిక్సెల్ రిజ‌ల్యూష‌న్ తో ఆండ్రాయిడ్ 10 ఫార్మాట్ మీద ప‌ని చేస్తుంది. దీని స్పెషాలిటీ ఏమిటంటే 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండ‌డం. ఎవ‌రైనా 10 వేల లోపు కావాల‌నుకునే వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్ష‌న్.

No comment allowed please