Indigo : గాలి మోటార్లలో తిరిగే వారికి శుభవార్త చెప్పింది దేశీయ విమానయాన సంస్థ ఇండిగో. బస్సులు, రైళ్లు ఛార్జీల మోత మోగించడంతో జనం ఫ్లయిట్ల వైపు చూస్తున్నారు. ఒకప్పుడు విమానాలలో తిరగాలంటే పెట్టి పుట్టాలి అన్న సామెత ఉండేది. ఇపుడు సామాన్యులు సైతం విమానాలలో తిరిగే అవకాశాలు ఎక్కువయ్యాయి. ఇదంతా టెక్నాలజీ తెచ్చిన మార్పు. ప్రపంచం రాను రాను చిన్నదై పోతోంది. ఐటీ, లాజిస్టిక్, ఎంటర్ టైన్ మెంట్, తదితర రంగాలన్నీ అవకాశాలకు దారులు తెరుస్తున్నాయి. దీంతో ఉపాధి, ఉద్యోగాల కోసం, మెరుగైన జీవితం కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లని తప్పని పరిస్థితి నెలకొంది.
ఐటీ , టెలికాం, ఫార్మా దిగ్గజ కంపెనీల చూపంతా ఇండియాలోని హైదరాబాద్ పై పడింది. ఇతర దేశాలతో పాటు ఇండియాలోన ప్రధాన నగరాల మధ్య దూరం తగ్గుతోంది విమానయాన సర్వీసుల ద్వారా. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లాలంటే కనీసం 12 గంటల సమయం పడుతుంది. అదే ఫ్లయిట్ అయితే జస్ట్ 2 గంటల్లో అక్కడికి చేరుకోవచ్చు. ప్రయాణికులు లగ్జరీని కోరుకుంటున్నారు. కంఫర్ట్ ఉండేలా చూస్తున్నారు. ఖర్చుకు వెనుకాడడం లేదు.
తాజాగా ఇండిగో మరో ఏడు నగరాలకు ఫ్లయిట్ సర్వీసులు స్టార్ట్ చేయాలని నిర్ణయించింది. లెహ్, దర్భంగా, ఆగ్రా, కర్నూల్, బరేలీ, దుర్గాపూ్, రాజ్ కోట్ లకు వచ్చే ఫిబ్రవరి నుంచి ప్రారంభించాలని డిసైడ్ అయింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఇదే సంస్థ 61 నగరాలకు సర్వీసులు నడుపుతోంది. ఈ సంఖ్య పెంచాలని అనుకున్నట్లు తెలిపింది. సో ట్రావెలర్లకు పండగ అన్న మాట. కేంద్ర విమానయాన సంస్థ నుంచి పర్మిషన్ కోసం అప్లయి చేసుకుంది ఇండిగో. వచ్చాక రయ్ మంటూ పరుగులు తీయడమే.
No comment allowed please