#Infosys : ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ దూకుడు
12 బిలియన్ డాలర్ల ఒప్పందం ఇన్ఫోసిస్ రికార్డు
Infosys : కరోనా ప్రభావం ఉన్నా ఐటీ సెక్టార్ మీద అంతగా చూపించడం లేదు. ఇంటి వద్ద నుంచే పనులు చేపట్టేలా అన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు ఆఫర్లు ఇచ్చాయి. దీంతో ఆశించిన దానికంటే ఎక్కువగా ఫలితాలు వస్తున్నాయి. ఇది మంచి పరిణామమే. ఓ వైపు భారత ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకు కిందకే వెళుతోంది తప్ప పైకి రావడం లేదు. మోదీ సమర్థవంతమైన పాలన అందిస్తున్నా, ఉద్దీపన చర్యలు తీసుకున్నా సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఒనగూరింది ఏమీ లేదు. ఇక ఐటీ రంగానికి వస్తే ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో దేశీయ కంపెనీ ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ దూకుడు పెంచింది.
మెరుగైన ఫలితాలు సాధించింది. నికర లాభం 17 దాకా పెరిగి 5 వే 197 కోట్లను తాకింది. వార్షిక ప్రాతిపదికన చూసి నట్లయితే 12 శాతం పుంజుకుని 25 వేల 927 కోట్లకు చేరుకుంది. క్యూ3 లో కంపెనీ హిస్టరీలోనే అత్యధికంగా 7.13 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ప్రాతిపదికన అంచనా వేస్తే 4.5 శాతం మేర వృద్ధి చెందే అవకాశం ఉన్నట్లు ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. తమ కంపెనీ మరోసారి మెరుగైన ఫలితాలు సాధించినట్లు ఈ సందర్భంగా ఇన్ఫోసిస్ సిఇఓ, మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ పరేఖ్ వెల్లడించారు.
కస్టమర్ల కు అవసరమైన వ్యూహాలను అమలు చేయడం, డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషన్ విభాగంలో అవకాశాలను చేజిక్కించు కోవడం ద్వారా వేగవంతమైన వృద్ధిని సాధించినట్లు తెలిపారు. గత తొమ్మిది నెలల కాలంలో 12 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు చేసుకున్నామని, ఒక రకంగా తమ కంపెనీ చరిత్రలో ఒక రికార్డుగా పరేఖ్ అభివర్ణించారు. గత ఏడాది వరకు చూస్తే ఇన్ఫోసిస్ లో రెండున్నర లక్షల మంది పని చేస్తున్నారని, రాబోయే రోజుల్లో నిపుణులు, కొత్త వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు.
No comment allowed please