#ONGC : గ్యాస్ కస్టమర్లకు ఐఓసీఎల్ గుడ్ న్యూస్
బుక్ చేసిన గంట లోపే సిలిండర్
ONGC : దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగాలంటే తిండి కావాల్సిందే. ప్రతి ఒక్క కుటుంబానికి గ్యాస్ వినియోగం అత్యవసరంగా మారింది. ఏ మాత్రం గ్యాస్ లేక పోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఇప్పటికే భారత్ గ్యాస్ లిమిటెడ్, హెచ్పిసీఎల్, ఇండన్ గ్యాస్ కంపెనీలు దేశ వ్యాప్తంగా వినియోగదారులకు గ్యాస్ ను సరఫరా చేస్తున్నాయి. ఈ కంపెనీలపై కేంద్ర ప్రభుత్వం నియంత్రణ ఉంటుంది. తాజాగా బీజేపీ సర్కార్ ఉన్న పళంగా ఒక్కొక్క ప్రభుత్వ రంగ సంస్థను అమ్మడమో లేదా ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తూ వస్తోంది.
గ్యాస్ పై కూడా మోదీ, అమిత్ షా కన్ను పడింది. ఎడా పెడా ఇష్టానుసారంగా గ్యాస్ ధరలను పెంచుతూ పోతోంది. మరో వైపు పెట్రోల్, డీజిల్ ధరలపై నియంత్రణ లేకుండా పోయింది. దీంతో అటు గ్యాస్, ఇటు ఆయిల్ ధరల పెంపుతో జనం నానా ఇబ్బందులకు లోనవుతున్నారు. లక్షలాది మందికి గ్యాస్ తో నిత్యం పని ఉంటుంది. దీంతో గ్యాస్ బుక్ చేసిన తర్వాత రెండు రోజులు లేదా వారం రోజులు పడుతుంది వచ్చేంత వరకు. దీనిని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత త్వరగా వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చేసేందుకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రయత్నాలు చేస్తోంది.
తత్కాల్ సర్వీసులు ప్రారంభించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. బుక్ చేసిన గంట లోపే సిలిండర్ డెలివరీ చేసేందుకు ప్లాన్ చేసింది. ఎలా వర్కవుట్ అవుతందనే దానిపై కంపెనీ మల్లగుల్లాలు పడుతోంది. బుక్ చేసుకున్న 30 లేదా 45 నిమిషాల లోపే డెలివరీ చేయాలని అనుకుంటోంది. తత్కాల్ కింద ప్రతి రాష్ట్రంలోని ప్రముఖ నగరం లేదా జిల్లాను గురర్తించనుంది.
మొదటగా దీనిని అమలు చేస్తారు. ఇది సక్సెస్ అయితే దేశ వ్యాప్తంగా అమలు చేస్తారు. అయితే ఎప్పటి నుంచి ఈ డోర్ డెలివరీ సర్వీస్ అమలవుతుందనే దానిపై ఐఓసీఎల్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇదే కనుక అమలైతే వినియోగదారులకు కష్టాలు తీరినట్లే. ఇలాంటి సదుపాయం త్వరలోనే రావాలని మనందరం కోరుకుందాం.
No comment allowed please