#Lingoccha : లింగోచ్చా చిత్రం నుంచి 2వ పాట విడుద‌ల

Release of the 2nd song from the movie "Lingochcha"

Lingoccha : కార్తీక్ రత్నం సూప్యార్ధే సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీకళ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న చిత్రం “లింగోచ్చా”. ఆకర్షణీయమైన టీజర్, మరియు మొదటి పాటతో ఇప్పటికే ఆకట్టుకున్న ఈ సినిమాలోని 2 వ పాట “నూర్జ” “సుప్రీం హీరో” సాయి తేజ్ ఈరోజు విడుదల చేశారు. నిర్మాణాంతర కార్యక్రమాలు ముగించుకున్న ఈ ప్రేమకధా చిత్రం విడుదలకి సిద్ధమైంది. మొదటి పాటకి విశేషమైన స్పందన రావడంతో ఈ రోజు విడుదలైన రెండవ పాట ‘నూర్జ’ కూడా శ్రోతల్ని ఆకట్టుకుంటుందని దర్శక నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటకి రచన ఉదయ్ మదినేని, సంగీతం మరియు గానం బికాజ్ రాజ్, కొరియోగ్రఫీ భాను, మాటలు ఉదయ్ మదినేని, రచన – దర్శకత్వం ఆనంద్ బడా, నిర్మాత యాదగిరి రాజు

No comment allowed please