#ForiegnLanguages : విదేశీ భాష ల్లో నైపుణ్యం ఉపాధికి ఊతం
ఫారిన్ లాంగ్వేజెస్ లో పట్టు సాధిస్తే నో ఫికర్
Foriegn Languages : టెక్నాలజీ పెరిగాక దేశాల మధ్య దూరాలు దగ్గరై పోయాయి. దుబాసీలు, అనువాదకులు, విదేశీ భాషల నిపుణులకు ఎనలేని డిమాండ్ పెరిగింది. వివిధ దేశాల ప్రజల జీవన విధానాలు, సంస్కృతి, భాషలపై మక్కువ కలిగిన వారికి ఈ కోర్సులు ఉపాధి అవకాశాలు కల్పిస్తాయనడంలో సందేహం లేదు. ఫారిన్ లాంగ్వేజెస్ నిపుణులకు అంతర్జాతీయంగా చెప్పలేని గిరాకీ ఉంటోంది. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పెరిగాయి. ఆర్థిక సంబంధాలు గట్టి పడుతున్నాయి. కంపెనీలు తాము కార్యకలాపాలు నిర్వహించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్న దేశాలకు సంబంధించిన భాషలపై పట్టున్న వారి కోసం వెతుకుతున్నాయి.
వీరు కోరుకున్నంత ఇచ్చేందుకు రెడీ అంటున్నాయి. మన ఇండియన్లకు ఇంగ్లీష్ మీద ఉన్న మోజు ఇతర భాషలపై ఉండదు. ప్రాంతీయ అభిమానం అంటే తమిళనాడును చూసి నేర్చు కోవాలి. అలాగే ప్రపంచంలో చూస్తే చైనా తర్వాతే ఎవరైనా. తమ భాషకు ప్రయారిటీ ఇస్తేనే అక్కడ కంపెనీలు మనగలుగుతాయి. లేక పోతే దుకాణం మూసు కోవాల్సిందే. డ్రాగన్ స్ట్రాటజీ అంతా డిఫరెంట్. వేతనాల పరంగా చూస్తే ఎంఎన్‌సీల్లో విదేశీ భాషలు నేర్చుకున్న వారికి సహచర ఎంప్లాయిస్ తో పోలిస్తే 20 శాతం ఎక్కువగా లభిస్తోందంటే ఆశ్చర్యం వేయక మానదు. కేపీఓ, బిపిఓ, ఫార్మా, టెలికాం రంగాల్లో వీరికి ఎక్కువ డిమాండ్ ఉంటోంది.
ఇంటర్నేషనల్ పరంగా చూస్తే ఫ్రెంచ్, చైనీస్, స్పానిష్, జర్మన్, జపనీస్, కొరియన్ భాషలు రాజ్యం ఏలుతున్నాయి. ఆన్ లైన్ లోను ఇటు ఆఫ్ లైన్ లోను వీటిని నేర్చుకునే వీలుంది. యూనివర్శిటీలు , ఇనిస్టిట్యూట్‌లు, ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లు సర్టిఫికెట్ నుంచి పీజీ డిప్లొమా దాకా కోర్సులు అందిస్తున్నాయి. తక్కువ కాలంలో కాస్తంత శ్రద్ధ పెడితే లక్షల వేతనం అందు కోవచ్చు. ఇక వివిధ దేశాల ఎంబసీలు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నాయి. సగటున 50 వేల నుంచి లక్షల దాకా ఉంటోంది. 30 దేశాల్లో ఫ్రెంచ్ భాష డామినేట్ చేస్తోంది. ఇందులో ఇంగ్లీష్ పదాలు ఉండడమే కారణం.
No comment allowed please