#AlluduAdhurs: అల్లుడు అదుర్స్ ప్రేక్షకులకు బెదుర్స్
Alludu Adurs: రాక్షసుడు సినిమా తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ నుంచి సరి కొత్త కథలతో ప్రేక్షకులని అలరిస్తాడని అనుకున్న తరుణంలో కందిరీగ, రభస, హైపర్ చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఫక్తు కమర్శియల్ ఫార్మాట్లో అల్లుడు అదుర్స్ (Alludu Adurs)అనే సినిమాతో సంక్రాంతి బరిలో దిగాడు. ఈ సినిమా విశేషాలు ఓ సారి పరిశీలిస్తే...
Alludu Adurs: రాక్షసుడు సినిమా తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ నుంచి సరి కొత్త కథలతో ప్రేక్షకులని అలరిస్తాడని అనుకున్న తరుణంలో కందిరీగ, రభస, హైపర్ చిత్రాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఫక్తు కమర్శియల్ ఫార్మాట్లో అల్లుడు అదుర్స్ (Alludu Adurs)అనే సినిమాతో సంక్రాంతి బరిలో దిగాడు. ఈ సినిమా విశేషాలు ఓ సారి పరిశీలిస్తే…
కథ ఏమిటంటే…
చిన్నప్పుడే స్కూల్ ఏజ్‌లో వసుంధర (అను ఇమాన్యుయేల్) ప్రేమలో పడ్డ శ్రీను ఆమెకు దూరం కావటంతో ఆడవాళ్లకు, ప్రేమ అంటేనే అసహ్యించుకునేలా ప్రవర్తిస్తాడు. అయితే ఊహించని విధంగా తొలిచూపులోనే కౌముది (నభా నటేష్) ప్రేమలో పడి కొత్త ట్విస్ట్ ఇస్తాడు. అయితే తెలుగు సినిమాలలో కనిపించేలా యధాలాపంగా నిజామాబాద్ జైపాల్ రెడ్డి (ప్రకాష్ రాజ్)తన పెద్ద కూతురు వసుంధర ప్రేమలో విఫలం కావటంతో పాటు ప్రేమ పదం ఎత్తితేనే మండి పడుతుంటాడు. అయితే జైపాల్ రెడ్డికి గజ(సోనూ సూద్)కు ఉన్న వైరం కధని మరోమలుపు తిప్పుతుంది. వీరిద్దరి పగలో మధ్యలో శ్రీను ఎంట్రీతో ఏమైంది. కౌముది, వసుంధరల ప్రేమకు ఫలించిందా? లేదా? అన్నది తెరమీద చూడాలి.
ఎలా ఉందంటే…
తొలి భాగమంతా రొటీన్ సన్నివేశాలతో జైపాల్ రెడ్డి, శ్రీను, కౌము ది ల నడుమ పాట, ఫైట్, కామెడీ , లవ్ ఇలా పలు సీన్లతో మలిచాడు. ఇక రెండో భాగంలోనూ సోనూ సూద్ రాకతో మంచి ట్విస్టులు పడతాయనుకుంటే గజను కమెడియన్‌గా మార్చేయటం ఇబ్బందిగా అనిపిస్తుంది. సినిమాని కమర్షియల్‌గా తీర్చి దిద్దాలనుకున్నట్టు కనిపిస్తోంది. సీన్ల లో కంటిన్యూటీ తక్కువ లింక్ లేకుండా ఇవి ఉండాలి అన్న తీరుగా పేర్చినట్టే అనిపించింది. ఏదో చేద్దామని ఆరంభించి ఏమీ చేయలేక చకచకా ముగించేయాలనుకున్నట్టు అనిపిస్తుంది.
ఎవరెలా చేసారంటే…
సినిమా మొత్తం బెల్లంకొండ శ్రీనివాస్ తన భుజస్కందాలపై వేసుకుని నడిపించాడు యాక్టింగ్, డ్యాన్స్‌లలో మంచి ఎనర్జీతో చేశాడు. ఇక ప్రకాష్ రాజ్‌కు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. భయపెట్టడం, నవ్వించడం లో తన మార్కు చూపాడు.. అను ఇమాన్యుయేల్ అందాలు ఆరబోసేందుకు పరిమితమైపోయింది. నభానటేష్కి నటించే స్కోప్ రావటంతో తనదైన తీరుగానటించింది. ఇక సోనూ సూద్ ను ప్రేక్షకుడు ఎలా అనుకుని ధియేటర్లోకి వస్తాడో అందుకు భిన్నంగా ఉంది. తొలుత కొన్ని సీన్లు తీసినా ఇటీవల కరోనా సమయంలో చేసిన సేవలతో కొత్త ఇమేజ్ తెచ్చుకున్న సోనూ సూద్ పాత్రలో మార్పులు చేసి చిత్రీకరించినట్టు కనిపిస్తుంది. ఇక వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, చమ్మక్ చంద్ర, శ్రీనివాస్ రెడ్డి, గెటప్ శ్రీను, మహేష్ విట్టా ప్రేక్షకులను నవ్వించే ప్రయత్నం చేశారు.
సాంకేతికంగా..
దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కందిరీగ సినిమాతో ఆరంభించిన ఫార్మూలానే మళ్లీ నమ్ముకున్నాడ నిపించింది. తన గత సినిమాలలోని ఇద్దరు హీరోయిన్లు, ఇద్దరు రౌడీలు, కామెడీ, స్క్రీన్ ప్లే లనే ఫాలొ అయిపోయాడు. దీంతో సినిమా అంతా రొటీన్ సీన్లతో నిండిపోయింది. దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా ఇందులో ఎలాంటి కొత్తదనం ప్రదర్శించలేదు. ఇక చెప్పుకోదగ్గది చోటా కే నాయుడు కెమెరా పనితనం హీరోయిన్ల అందాలతో పాటు పాటలు, సన్నివేశాల చిత్రీకరణ బాగుంది. గుర్తుంచుకునే పాటలు, మాటలు కనిపించవు, వినిపించలేదు. మిగిలిన శాఖలన్నీ సో…సో…
చివరిగా
అనవసరపు పాటలు, అరిగిపోయిన కథ,కథనాలతో, బోర్ కొట్టే సన్నివేశాలతో నింపేసిన ఈ సినిమా అల్లుడు అదుర్స్(Alludu Adurs) ప్రేక్షకులకు బెదుర్స్ అనిపించేలా ఉంది. .
No comment allowed please