Balakrishna Unstoppable : బాల‌య్య బాబు అరుదైన రికార్డు

దుమ్ము రేపుతున్న ఎన్బీకే షో

Balakrishna Unstoppable : నంద‌మూరి బాల‌కృష్ణ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. నంద‌మూరి వార‌సుడిగా ఆయ‌న ఇప్ప‌టికే పేరొందారు. న‌ట సింహంగా ఎంద‌రో అభిమానుల‌ను ఆయ‌న సంపాదించుకున్నారు.

ఇక డైన‌మిక్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో ఇటీవ‌ల విడుద‌లైన అఖండ మూవీ ఊహించ‌ని రీతిలో స‌క్సెస్ బాట ప‌ట్టింది. ఇదే స‌మ‌యంలో ఊహించ‌ని రీతిలో బాల‌కృష్ణ రియాల్టీ షో చేయ‌డం, అది సూప‌ర్ హిట్ తెచ్చుకోవ‌డం హాట్ టాపిక్ గా మారింది.

ఇప్ప‌టికే సినిమాల‌లో టాప్ హీరోలుగా పేరొందిన జూనియ‌ర్ ఎన్టీఆర్, చిరంజీవి, నాగార్జున, నాని వ్యాఖ్య‌త‌లుగా చేశారు. జెమిని, జీటీవీ, స్టార్ మా ఇలా రియాల్టీ షోస్ తో ఆక‌ట్టుకున్నారు.

తాజాగా అల్లు అర‌వింద్ కు చెందిన ఆహా ఓటీటీ ప్లాట్ ఫార‌మ్ వేదిక‌గా నందమూరి న‌ట సింహం బాల‌య్య బాబు అన్ స్టాప‌బుల్(Balakrishna Unstoppable) అంటూ ఓ ప్రోగ్రాం చేస్తున్నాడు. టాక్ షోకు విప‌రీత‌మైన ఆద‌ర‌ణ ల‌భించింది. రికార్డుల మోత మోగిస్తోంది.

ఇప్ప‌టి దాకా ప్రసార‌మైన అన్ని రియాల్టీ షో స్ కంటే బాల‌కృష్ణ నిర్వ‌హిస్తున్న త‌గ్గేదేలే ప్రోగ్రాం టాప్ లో నిలవడం విశేషం. ఆయ‌న ప్ర‌ముఖ తార‌ల‌ను ఒక్కొక్క‌రినీ త‌న‌దైన స్టైల్ లో ఇంట‌ర్వ్యూ చేస్తూ వ‌స్తున్నారు.

ఇప్ప‌టికే బ్ర‌హ్మానందం, సుకుమార్ , ర‌వితేజ్ ఇలా ఒక్కొక్క‌రినీ ఒక్కో రీతిన త‌న‌దైన స్టైల్ లో మ‌రింత ర‌క్తి క‌ట్టిస్తున్నారు. దీంతో ఈ టాక్ షో సౌత్ ఇండియాలో మోస్ట్ పాపుల‌ర్ షోగా రికార్డు సృష్టించింది.

ఆయ‌న డైలాగులతో న‌వ్విస్తూ, ఆద‌రిస్తూ, ఆట ప‌ట్టిస్తూ..మ్యాజిక్ చేస్తున్నారు. తాజాగా ఇండియ‌న్ మూవీ డేటా బేస్ -ఐఎండీబీ విడుద‌ల చేసిన రేటింగ్స్ లో టాప్ 10 రియాల్టీ షోలో నిలిచింది. ఇప్ప‌టి వ‌ర‌కు 7 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది.

Also Read : నిద్ర లేని రాత్రులు గ‌డిపా – ర‌వీనా

Leave A Reply

Your Email Id will not be published!