Bussinessman Movie : ప్రిన్స్ ‘బిజినెస్ మేన్’ కు ప‌దేళ్లు 

సినీ జ‌గ‌త్తులో మూవీ సెన్సేష‌న్ 

Bussinessman Movie : తెలుగు సినిమా రంగాన్నే కాదు అటు బాలీవుడ్ ను సైతం షేక్ చేసిన మూవీ ప్రిన్స్ మ‌హేష్ బాబు న‌టించిన  బిజినెస్ మ్యాన్(Bussinessman Movie). ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌ల‌తో సినిమాను న‌డిపించిన తీరు అద్భ‌తం. త‌న‌దైన మార్క్ తో తీసిన ఈ మూవీ రికార్డులు బ‌ద్ద‌లు కొట్టింది.

ముంబై మాఫియా ఎలా ఉంటుందో ఇక్క‌డి నుంచి అక్క‌డికి వెళ్లి ఎలా టాప్ రేంజ్ లో సెట్ చేస్తాడ‌నే దానిపై తీసిన ఈ మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. బిజినెస్ మ్యాన్ కు క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం పూరీ జ‌గ‌న్నాథ్.

అప్ప‌టికే మ‌హేష్ బాబుతో పోకిరీ తీశాడు. అది బ్లాక్ బ‌స్ట‌ర్. ఆర్ ఆర్ వెంక‌ట్ నిర్మాత‌.

ప్రిన్స్ తో కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టించింది. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందించాడు. ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం ఇచ్చాడు.

ఆర్ ఆర్ మేక‌ర్స్ ద్వారా ఈ మూవీ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను 2012 జ‌న‌వ‌రి 13న విడుద‌ల చేశారు.

స‌రిగ్గా ఈ చిత్రం రిలీజ్ అయి ప‌దేళ్లు అవుతోంది. అప్పుడే అన్నేళ్లు అయ్యిందా వచ్చి అనిపిస్తోంది.

యాక్ష‌న్ , క్రైమ్ క‌థాంశంగా తీర్చిదిద్దాడు పూరీ జ‌గ‌న్నాథ్. నాజ‌ర్ , సాయాజీ షిండే,

ర‌జా మురాద్ , సుబ్బ‌రాజు, బ్ర‌హ్మాజీ ఇత‌ర పాత్రల్లో న‌టించారు. ఈ చిత్రం విజ‌య్ సూర్య అలియాస్ సూర్య భాయ్ చుట్టూ న‌డుస్తుంది.

ముంబై పోలీసులు మాఫియా రాజ్ అంతం అయిన‌ట్లు ప్ర‌క‌టించిన‌ట్లే. ఏపీ నుంచి ముంబైని పాలించాల‌నే ఆకాంక్షతో వ‌చ్చిన వ్య‌క్తి.

స్థానిక పొలిటిక‌ల్ లీడ‌ర్ సాయంతో, న‌గ‌ర క‌మిష‌న‌ర్ కూతుర్ని ట్రాప్ చేయ‌డం ద్వారా త‌న జ‌ర్నీ ప్రారంభిస్తాడు.

ముఠా స‌హాయంతో సామూహిక ర‌క్ష‌కుడిగా మారిన‌ప్పుడు అవినీతి వ్య‌వ‌స్థ‌పై నిజ‌మైన ఉద్దేశాలు, వ్య‌క్తిగ‌త ద్వేషాలు హైలెట్ అవుతూ వ‌స్తాయి. త‌న శ‌త్రువులు, పోలీసుల నుండి హింసాత్మ‌క స‌వాళ్ల‌ను ఎదుర్కొంటాడు.

హైద‌రాబాద్, ముంబై, గోవాల‌లో చిత్రీక‌రించారు. బ్యాంకాక్ లో పాట‌లు తీశారు. 2012 న సంక్రాంతి రోజు విడుద‌లైంది. అత్య‌ధిక వ‌సూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది బిజినెస్ మ్యాన్.

2013లో బాస్ పేరుతో బెంగాలీలో రీమేక్ చేసి విడుద‌ల చేశారు. ఐఐఎంలో ఈ మూవీకి సంబంధించి ఓ చ‌ర్చ కూడా జ‌ర‌గ‌డం విశేషం.

Also Read : హృతిక్ రోష‌న్ న‌ట‌న‌లో సెన్సేష‌న్

Leave A Reply

Your Email Id will not be published!