Simbu Actor : తమిళ సినీ రంగంలో శింబు వెరీ వెరీ స్పెషల్. అతడికి లెక్కలేనంత మంది అభిమానులు ఉన్నారు. తండ్రి టి. రాజేందర్ బిగ్ డైరెక్టర్. ఇప్పటికే తమిళం, తెలుగు సినిమాలలో పేరొందారు.
తాజాగా ఎన్నో సినిమాలలో నటించి మెప్పించిన నటుడు శింబుకు(Simbu Actor) అరుదైన పురస్కారం లభించింది. ఈ మేరకు ప్రముఖ వేల్స్ యూనివర్శిటీ డాక్టరేట్ తో సత్కరించింది.
ఈ విషయాన్ని శింబు స్వయంగా సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా తన నటనతో పాటు చేసిన సేవలను గుర్తించి డాక్టరేట్ అవార్డు ఇచ్చినందుకు వేల్స్ యూనివర్శిటీ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నాడు.
ఈ డాక్టరేట్ ను తమిళ సినిమాకు, తన తల్లిదండ్రులకు అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు. అంతే కాకుండా తాను ఈ స్థాయిలో ఉండడానికి ప్రధాన కారణం వారేనని కొనియాడారు.
వారు లేక పోతే తాను లేనన్నాడు. వారు ఉండడం వల్లనే తాను హీరోగా సక్సెస్ అయ్యానని చెప్పాడు నటుడు శింబు. విభిన్న పాత్రలను ఎంచుకుంటూ నాకంటూ ఓ ప్రత్యేకత ఉండేలా జాగ్రత్త పడ్డానని తెలిపాడు.
తనను ఆదరిస్తున్న అభిమానులందరికీ తాను రుణపడి ఉన్నానని పేర్కొన్నాడు శింబారన్. ఇటీవల ఆయన నటించిన మూవీ భారీ సక్సెస్ ను మూటగట్టుకుంది.
సింబు సినిమా కెరీర్ 1995 నుంచి ప్రారంభమైంది. తల్లి ఉష నిర్మించగా రాజేందర్ దర్శకత్వంలో కాదల్ పాత్ర ద్వారా ఎంటరయ్యాడు. తమిళనాడులోని కృష్ణగిరి తొగరపల్లిలో 1983 ఫిబ్రవరి 3న పుట్టాడు. తమ్ముడు, సోదరి ఉన్నారు. శివ భక్తుడు.
Also Read : అతడు అద్భుతం అందుకే సంతోషం