Chinnajeeyar : యాదాద్రి అద్బుతం ఆధ్యాత్మిక సౌరభం
శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి
Chinnajeeyar : తెలంగాణ ఆధ్యాత్మిక సౌరభంతో అలరారుతోందంటూ కితాబు ఇచ్చారు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి(Chinnajeeyar). రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ది చెందుతోందన్నారు.
ముచ్చింతల లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమంలో మున్సిపల్ కమిషనర్ యాదగిరిరావు రచించిన ప్రగతి పుస్తకాన్ని ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అన్ని రంగాలతో పాటు ఆధ్యాత్మిక రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారంటూ కితాబు ఇచ్చారు చిన్నజీయర్ స్వామి(Chinnajeeyar).
లక్ష్మి నరసింహుడు కొలువైన యాదాద్రి ని దేశంలో గొప్ప పుణ్య క్షేత్రాలలో ఒకటిగా రూపు దిద్దేలా కృషి చేశారంటూ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికే యాదాద్రి తలమానికం కానుందన్నారు.
యాదాద్రితో పాటు రాముల వారు కొలువైన భద్రాద్రి, రాజరాజేశ్వర స్వామి కొలువైన వేములవాడతో పాటు రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో నిత్యం పూజలు జరిగేలా కృషి చేయడం కేసీఆర్ కు భక్తి పట్ల ఉన్న నిబద్దత తెలియ చేస్తుందన్నారు.
యాదాద్రి, భద్రాద్రి, రాజన్న, జోగుళాంబ పేర్లతో జిల్లాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ చేస్తున్న వివిధ రంగాల అభివృద్ధిని ప్రగతి పేరుతో చేర్చడం బాగుందన్నారు.
ప్రత్యేకంగా రాష్ట్రంలో దేవాలయాలు తిరిగి పునర్ వైభవం సాధించేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని పేర్కొన్నారు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి.
పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వర్ రావు కమిషనర్ చేసిన కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రామానంద తీర్థ గ్రామీణ విద్యా సంస్థ డైరెక్టర్ డాక్టర్ కిషోర్ కూడా పాల్గొన్నారు.
Also Read : గత చరిత్రకు దర్పణం బుద్ధవనం