Telangana Schools : అనుకున్నదే అయ్యింది. ఇప్పటికే ఓ వైపు కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండడంతో పాటు కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు మెల మెల్లగా పెరుగుతున్న తరుణంలో ముందు జాగ్రత్త చర్యగా తెలంగాణ విద్యా శాఖ (Telangana Schools)కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు రాష్ట్రంలోని విద్యా సంస్థలకు ఈనెల 16 వరకు సంక్రాంతి పండగ సందర్భంగా సెలవులు ప్రకటించింది. భాగ్యనగరం నుంచి సగం జనాభా ఖాళీ అయ్యింది.
దీంతో వేలాది కుటుంబాలు తమ స్వంతూళ్లకు వెళ్లాయి. ఈ తరుణంలో కేసుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని టీచర్లు, పేరెంట్స్, విద్యార్థుల భవిష్యత్తు, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సెలవులను పొడిగించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా జేఎన్టీయూ ఆన్ లైన్ లో క్లాసులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఆల్ స్టూడెంట్స్ ఆన్ లైన్ లోనే హాజరు కావాలని సూచించింది.
ఇదే సమయంలో అన్ని పాఠశాలలు, కాలేజీలు, ఉన్నత విద్యా సంస్థలు అన్నీ అదే బాట పట్టనున్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సైతం కరోనా కేసుల తీవ్రత దృష్ట్యా సెలవులు పొడిగించడం తప్ప మరో మార్గం లేదని సూచించింది.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఈనెల 8 నుంచి 16 దాకా సెలవులు ప్రకటించింది ప్రభుత్వం.
కాగా కేసులు తగ్గక పోవడంతో మరికొద్ది రోజులు విద్యార్థులకు సెలవులు ఇవ్వడమే బెటర్ అని సూచించింది. ఈనెల 20 వరకు కరోనా ఆంక్షలు మరింత కఠినతరం చేసింది.
ఎటువంటి ర్యాలీలు, సమావేశాలు నిర్వహించ కూడదని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
Also Read : విదేశీ విద్యా నిధి విద్యార్థులకు పెన్నిధి