Ts Schools : నిన్నటి దాకా ఎలాంటి ప్రభావం చూపని కరోనా ఉన్నట్టుండి సంక్రాంతి పండుగ వేళ ఠారెత్తిస్తోంది. ఓ వైపు కరోనా మహమ్మారి కేసులు మరో వైపు కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసుల (Ts Schools )పెరుగుదలతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.
ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు కొంత కాలం పాటు ఆంక్షలు విధించడమే మంచిదని సూచించింది. దీంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యవసర సమావేశం నిర్వహించారు.
రాష్ట్రంలో కరోనా కారణంగా నెలకొన్న తాజా పరిణామాలపై సమీక్షించారు. విద్యార్థుల భవిష్యత్తు, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత స్థాయి పాఠశాలలతో పాటు కాలేజీలు, యూనివర్శిటీ విద్యా సంస్థలను కొంత కాలం పాటు మూసి ఉంచాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ ను ఆదేశించారు.
దీంతో ఈనెల 16వ తేదీ వరకు ప్రకటించిన సెలవులను(Ts Schools )మరికొంత కాలం పాటు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం ఈ నెల 8 నుంచి 16 వరకు సెలవులు ప్రకటించింది.
కరోనా దెబ్బకు 16 నుంచి 30వ తేదీ వరకు సెలవుల్ని పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇంకో వైపు రాష్ట్రంలో కరోనా ఆంక్షల్ని 20వ తేదీకి పొడిగిస్తూ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది.
కేసుల పరంగా చూస్తే నిన్న ఒక్క రోజు ఏకంగా 1963 కేసులు కొత్తవి నమోదు కావడం విశేషం. ఇదిలా ఉండగా విద్యార్థులకు ఆన్ లైన్ లో క్లాసులు నిర్వహించాలని విద్యా శాఖ ఆదేశించింది.
Also Read : త్వరలో మోహన్ బాబు యూనివర్శిటీ