Koti Womens College : మహిళా వర్శిటీగా కోఠీ ఉమెన్స్ కాలేజ్
స్పష్టం చేసిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Koti Womens College : కోఠి మహిళా కాలేజ్ కు అరుదైన గుర్తింపు లభించనుంది. వందేళ్ల ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కాలేజ్ ను మహిళా విశ్వ విద్యాలయంగా అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయించింది.
ఈ మేరకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కోఠి ఉమెన్స్ కాలేజీని (Koti Womens College )మహిళా యూనివర్శిటీగా తీర్చిదిద్దే అంశంపై తన ఆఫీసులో విద్యా శాఖ అధికారులతో సమీక్ష చేపట్టారు.
ప్రస్తుతం ఉస్మానియా యూనివర్శిటీ కోఠి ఉమెన్స్ కాలేజీ అనుబంధంగా ఉంది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ అటామనస్ తో పాటు న్యాక్ గుర్తింపు కలిగి ఉంది.
యూనివర్శిటీగా మార్చేందుకు అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయని అందుకే వర్సిటీ గా మార్చాలని నిర్ణయించింది. ఈ విషయాన్నిరివీల్ చేశారు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉమెన్స్ కాలేజీని(Koti Womens College )యూనివర్శిటీగా మారిస్తే కావాల్సిన బోధానా సౌకర్యాలు, విద్యార్థులకు వసతులు, మౌళిక సదుపాయాలు, తదితర అంశాలపై అధ్యయనం చేసి పూర్తిగా రిపోర్ట్ రూపొందించాలని ఆదేశించారు ఇంద్రారెడ్డి.
ఇదిలా ఉండగా కోఠి ఉమెన్స్ కాలేజీలో ఏకంగా 4 వేలకు పైగా విద్యార్థినులు చదువుతున్నారు. ఒకవేళ గనుక ప్రభుత్వం విశ్వ విద్యాలయంగా మారిస్తే ఆ సంఖ్య మరింత రెట్టింపు అయ్యే చాన్స్ ఉందని భావిస్తోంది .
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త కోర్సులు కూడా ఇంట్రడ్యూస్ చేయాలని ఆదేశించారు సీఎం. దీంతో మంత్రి మీటింగ్ నిర్వహించారు.
Also Read : త్వరలో మోహన్ బాబు యూనివర్శిటీ