Sri Ramanujacharya : అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన శ్రీ రామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు శ్రీరామనగరం ముస్తాబవుతోంది. ముచ్చింతల్ ఆశ్రమంలో దీనిని ఏర్పాటు చేశారు.
శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి(Sri Ramanujacharya )వారి సారథ్యంలో ఇదంతా రూపుదిద్దుకుంది. భారీ ఎత్తున ఖర్చు పెట్టి దీనిని నిర్మించారు. అంతర్గత రహదారులు, పూల, ఔషధ మొక్కలు నాటుతున్నారు.
యాగశాలల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. మొత్తంగా సుందరంగా తీర్చిదిద్దే పనిలో పడ్డారు. చుట్టూతా లైట్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీ రామానుజ సహస్రాబ్ది (Sri Ramanujacharya )సమారోహం పేరుతో వేడుకలు నిర్వహించేందుకు నిర్ణయించారు చినజీయర్. 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని 5న ప్రధాని మోదీ ఆవిష్కరిస్తారు.
120 కిలోల బంగారంతో రూపొందించిన 54 అంగుళాల రామానుజ నిత్య పూజా మూర్తిని 13న రాష్ట్రపతి కోవింద్ ప్రారంభించనున్నారు. ఇందులో దేవతా మూర్తులు కొలువు తీరేలా చేశారు.
రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు రోడ్ల విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని ఉండడం విశేషం.
ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యేక సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు. మిషన్ భగీరథ వాటర్ ఉండేలా చూశారు. 2 లక్షల కేజీల స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఇక్కడ ఉపయోగిస్తారు.
దేశం నలుమూలల నుంచి 5 వేల మంది రుత్వికులు, వేద పండితులు హాజరుకానున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటికే శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి పలువురు ముఖ్యమంత్రులను కలిసి ఆహ్వానాలు అందజేశారు.
వారిలో తెలంగాణ, ఏపీ, తమిళనాడు సీఎంలు కేసీఆర్, జగన్, ఎంకే స్టాలిన్ లు ఉన్నారు.
Also Read : యాదాద్రి అద్బుతం ఆధ్యాత్మిక సౌరభం