Urvashi : బహు భాషా నటిగా పేరు తెచ్చుకున్నారు ఊర్వశి. ఆమె అసలు పేరు కవితా రంజని. ఇవాళ ఊర్వశి పుట్టిన రోజు. 1969 జనవరి 25న కేరళ లోని తిరువనంతపురంలో పుట్టారు. భారతీయ సినీ రంగంలో ఊర్వశిగా(Urvashi) పేరొందారు.
నటిగానే కాకుండా వ్యాఖ్యాతగా, నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. ఆమె ప్రధానంగా మలయాళం, తెలుగు, తమిళ సినిమాల్లో నటించింది. రచయితగా కూడా ఆమెకు పట్టుంది.
ఉల్సవెమెలం, నూట్టండు సినిమాలకు రాసింది. పలు సినిమాలను కూడా నిర్మించింది. 2005లో విడుదలైన అచువింటే అమ్మా మూవీలో ఊర్వశి నటనకు గాను ఉత్తమ సహాయ నటిగా జాతీయ ఫిలిం పురస్కారం అందుకున్నారు.
ఆమె సోదరీమణులైన శివాంజలి, కల్పనలు కూడా నటీమణులుగా పేరు తెచ్చుకున్నారు. ఆమె సోదరులు కమల్ రాయ్, దివంగత ప్రిన్స్ లు కూడా కొన్ని మలయాళం సినిమాల్లో నటించారు.
దర్శకుడు భాగ్యరాజ్ ఆమెను ముంతనై ముడిచి సినిమాలో ఊర్వశిని(Urvashi) ఎంపిక చేశాడు. 2000 మే 2న సినీ నటుడు మనోజ్ కె. జయన్ ను పెళ్లి చేసుకుంది. 2008లో జయన్ ను నుంచి విడాకులు తీసుకుంది.
2013లో చెన్నైకి చెందిన బిల్డర్ శివ ప్రసాద్ ను పెళ్లి చేసుకుంది. వారిద్దరికి 2014లో ఓ కొడుకు పుట్టాడు. తెలుగు, తమిళ సినీ రంగంలోని ప్రముఖ హీరోలతో ఊర్వశి నటించి మెప్పించారు.
తెలుగులో రుస్తుం, యమ కింకరుడు, సందడే సందడి, అల్లరి రాముడు, స్వరాభిషేకం, భలే తమ్ముడు, మగువలకు మాత్రమే సినిమాల్లో నటించి ఆకట్టుకుంది.
Also Read : తగ్గేదే లేదంటున్న ‘లాల్ సింగ్ చద్దా