Shyam Singha Roy : ఓటీటీలో ‘శ్యామ్ సింగరాయ్’ సెన్సేషన్
నెట్ ఫ్లిక్స్ అత్యధిక వ్యూయర్షిప్ రికార్డు
Shyam Singha Roy : దిగ్గజ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అక్కర్లేదన్న మాటల్ని నిజం చేస్తున్నారు కొందరు దర్శకులు. తాజాగా రాహుల్ సాంకృత్యన్ ఆ కోవలోకి చేరాడు. బెంగాల్ నేటివిటీ ఆధారంగా ఆయన తీసిన శ్యామ్ సింగ రాయ్(Shyam Singha Roy )మూవీ ఆదరణ చూరగొంది.
తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా మంచి టాక్ తెచ్చుకుంది. ప్రత్యేకించి పాత్రలే కాదు సంగీతం, కెమెరా పనితనం, దర్శకుడి నిబద్దతతో పాటు ప్రతిభ చిత్రానికి మంచి మార్కులు పడేలా చేశాయి.
గత ఏడాది క్రిస్మస్ పర్వదినం సందర్భంగా 2021 డిసెంబర్ 24న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఇందులో ప్రధాన పాత్రల్లో నాని, కృతి శెట్టి, సాయి పల్లవి నటించి మెప్పించారు.
ఆ పాత్రల్లో జీవించారు. మంచి టాక్ తెచ్చు కోవడంతో ప్రముఖ అమెరికన్ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ శ్యామ్ సింగరాయ్(Shyam Singha Roy )ను కొనుగోలు చేసింది. ఎంతకు తీసుకున్నారనే విషయం బయట పెట్టలేదు.
ఈ ఏడాది జనవరి 21 నుంచి శ్యామ్ సింగ రాయ్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇప్పటికే స్టార్ లో బాలకృష్ణ నటించిన అఖండ దుమ్ము రేపితే తాజాగా సింగరాయ్ మూవీ నెట్ ఫ్లిక్స్ ను షేక్ చేసింది.
మూడు రోజుల్లో భారీగా వీక్షించిన చిత్రంగా నిలిచింది. ఇదే విషయాన్ని నెట్ ఫ్లిక్స్ తన అధికారిక ట్విట్టర్ లో వెల్లడించింది. ఏ సినిమా కూడా ఇంతలా ఆదరణ చూరగొనలేదని స్పష్టం చేసింది.
Also Read : తగ్గనంటున్న వార్నర్ భయ్యా