Yendluri Sudhakar : తెలుగు సాహిత్యంలో మరో తార రాలి పోయింది. కవిగా, రచయితగా, ఆచార్యుడిగా పేరొందిన ఎండ్లూరి సుధాకర్(Yendluri Sudhakar )ఇవాళ కన్ను మూశారు. ఆయన మరణం తెలంగాణ ప్రాంతానికి తీరని లోటు.
నిజామాబాద్ లోని పాములబస్తిలో 1959 జనవరి 21న జన్మించారు. కేంద్ర సాహిత్య అకాడెమీలో సభ్యుడిగా ఉన్నారు.
తెలుగు సలహా మండలి సభ్యుడిగా, తెలుగు అకాడమీలో సభ్యుడిగా పని చేశాడు.
హిందీ, ఉర్దూ పద్యాల, లఘు చిత్రాలకు అనువాదకుడిగా పని చేశారు. హైదరాబాద్ యూనివర్శిటీలో తెలుగు విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. వీధి బడిలో చదువుకుని యూనివర్శిటీ స్థాయికి చేరుకున్నారు.
హైదరాబాద్ నల్లకుంట లోని ప్రాచ్య కాలేజీలో ఓరియంటల్ విద్య చదివారు. ఓయూలో ఎంఏ, ఎంఫిల్ చేశారు.
తెలుగు విశ్వ విద్యాలయంలో పీహెచ్ డీ చేశారు. ఆయన రాసిన కవితలతో వర్తమానం ప్రచురించారు.
జాషువా నా కథపై ఎంఫిల్ చేశారు. కొత్త గబ్బిలం, నా అక్షరమే నా ఆయుధం లింబాలే రాసిన ఆత్మకథను అనువాదం చేశారు.
మల్లె మొగ్గల గొడుగు మాదిక కథలు, నల్ల ద్రాక్ష పందిరి, పుష్కర కవితలు, వర్గీకరణీయం దళిత దీర్ఘ కావ్యం, ఆటా జనికాంచె పేరుతో అమెరికా యాత్రా కథలు రాశారు.
జాషువా సాహిత్యం దృక్ఫథం పరిణామం పేరుతో పీహెచ్ డీ సిద్దాంత గ్రంథం గా వచ్చింది.
గోసంగి పేరుతో దీర్ఘ కావ్యం రాశారు. జాషువా జీవిత చరిత్రను కథానాయకుడు పేరుతో రచించారు.
నవయుగ కవి జాషువా పేరుతో మోనోగ్రాఫ్ , కావ్యత్రయం, సాహితీ సుధ, తొలి వెన్నెల పేరుతో సాహితీ వ్యాసాలు రాశారు ఎండ్లూరి సుధాకర్(Yendluri Sudhakar ).
1985 నుంచి 1990 దాకా తెలుగు పండిట్ గా చేశారు.
2004 నుంచి 2011 వరకు తెలుగు యూనివర్శిటీ వాజ్మయి పత్రికకు ఎడిటర్ గా ఉన్నారు.
అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, అసోసియేట్ ప్రొఫెసర్ గా, ఆధునిక శాఖాధిపతిగా పదవుల్ని నిర్వహించారు.
2009 నుంచి రాజమండ్రి సాహిత్య పీఠానికి ఆచార్యులుగా , డీన్ గా బాధ్యతలు చేపట్టారు.
ప్రస్తుతం హైదరాబాద్ యూనివర్శిటీ తెలుగు విభాగంలో పని చేస్తూ మృతి చెందారు. ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఎన్నో అవార్డులు, పురస్కారాలు దక్కాయి.
Also Read : అంగరంగ వైభవం శ్రీరామనగరం