Bhala Thandanana : తెలుగు సినిమాలో కథలు డామినేట్ చేస్తున్నాయి. టెక్నాలజీ పుణ్యమా అంటూ అటు ఓటీటీల హవా నడుస్తుండడంతో ఎంతో మంది కొత్త వారికి చాన్స్ దొరుకుతోంది. మరో వైపు మెయిన్ స్ట్రీమ్ సినిమా రంగంలో సైతం తమ సత్తా చాటుతున్నారు.
డిఫరెంట్ క్యారెక్టర్లను ఎంపిక చేసుకుంటూ తనకంటూ ఓ ఇమేజ్ స్వంతం చేసుకున్న నటుడు శ్రీవిష్ణు తాజాగా నటించిన చిత్రం భళా తందనానా(Bhala Thandanana). ఇవాళ ఈ మూవీకి సంబంధించి టీజర్ విడుదలైంది.
ప్రత్యేకమైన కాన్సెప్ట్ లను ఎంచుకోవడం ఇతడి స్పెషాలిటీ. వారాహి చలనచిత్రం పతాకంపై చైతన్య దంతలూరి భళా తందనానాకు దర్శకత్వం వహించారు. హీరో నాని టీజర్ ను విడుదల చేశారు.
సమాజంలోని దుష్ట శక్తులను ఎదుర్కొనేలా చిత్రాన్ని రూపొందించారు. రామచంద్రరాజు, అతని గ్యాంగ్ దాడి చేసేందుకు ప్రయత్నించినప్పుడు అమాయకుడిలా ప్రవర్తిస్తాడు.
ఆ తర్వాత తన నిజ స్వరూపాన్ని చూపిస్తాడు. హానికరమైన చిరునవ్వు ఇందులో ఆ క్యారెక్టర్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశాడు. మూవీకి సంబంధించి చివరి సీక్వెన్స్ ను కూడా ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.
ఈ దేశంలో లంచం లేనిదే కన్నంలో అన్నం రావడం లేదన్న డైలాగ్ పేలింది. ఒక రకంగా భళా తందనానా ప్రస్తుత సొసైటీకి అద్దం పట్టేలా ఉంది.
ప్రత్యేకించి నటుడు శ్రీవిష్ణుతో పాటు దర్శకుడు చైతన్య దంతలూరిని అభినందించాలి. డిఫరెంట్ లుక్స్ తో పాటు డిఫరెంట్ వేరియన్స్ తో దుమ్ము రేపాడు నటుడు. ఇందులో హీరోయిన్ గా కేథరిన్ త్రెసాకు మంచి పాత్ర దొరికింది.
Also Read : తాల్ సే తాల్ మిలా