KCR Mogulaiah : అంతరించి పోతున్న కిన్నెర వాయిద్యానికి ఎనలేని గుర్తింపు తీసుకు వచ్చిన కళాకారుడు కిన్నెర మొగులయ్యను(KCR Mogulaiah) ప్రత్యేకంగా అభినందించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.
ఉద్యమకారుడే కాదు సాహితీ, కళా పిపాసి అయిన కేసీఆర్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. కళాకారుల పట్ల తనకు ఉన్న ప్రేమను ప్రకటించారు.
శ్రీ దర్శనం మొగిలయ్యకు హైదరాబాద్ లో నివాసం ఉండేందుకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం కోసం అయ్యే ఖర్చు, ఇతరత్రా అవసరాల కోసం రూ. కోటి రూపాయలను ఇవాళ ప్రకటించారు.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వం దేశంలో వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులైన 128 మందికి పద్మ పురస్కారాలను ప్రకటించింది.
తెలంగాణ నుంచి రామచంద్రయ్య, పద్మజారెడ్డితో పాటు నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంటకు చెందిన దర్శనం మొగులయ్యకు పద్మశ్రీ అవార్డును ప్రకటించింది.
ఈ సందర్భంగా రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ , ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు తో కలిసి ప్రగతి భవన్ లో ఇవాళ సీఎం కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా దర్శనం మొగులయ్యను (KCR Mogulaiah)శాలువాతో సన్మానించి అభినందించారు.
ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ సజ్జనార్ ఆర్టీసీ గురించి ప్రచారం చేస్తున్నందుకు గాను జీవితాంతం ఉచితంగా బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించారు.
కాగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాకు సంబంధించి టైటిల్ సాంగ్ ను పాడారు దర్శనం మొగులయ్య.
Also Read : కవి ఎండ్లూరి సుధాకర్ కన్నుమూత