TTD : తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి దాకా ఆన్ లైన్ లోనే స్వామి, అమ్మవార్ల దర్శనం టోకెన్లు జారీ చేశారు.
కరోనా కారణంగా అర్ధాంతరంగా నిలిపి వేసిన ఆఫ్ లైన్ జారీ విధానాన్ని త్వరలోనే భక్తులకు అందుబాటులోకి తీసుకు రానున్నట్లు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.
ఒక రకంగా తిరుమల భక్తులకు ఇది తీపి కబురుగా భావించవచ్చు. ఇక రూ.300కి సంబంధించి ఆన్ లైన్ లో విడుదల చేసిన నిమిషాల లోపే టోకెన్లు అన్నీ అయి పోవడం విస్తు పోయేలా చేసింది.
కరోనా కారణంగా చాలా మంది తిరుమలను దర్శించుకోలేక పోయారు. దీంతో టీటీడీ (TTD)ప్రకటించిన కొద్ది నిమిషాల లోపే అయి పోవడంపై భక్తులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.
ప్రత్యేకించి టీటీడీ అనుసరిస్తున్న విధానాన్ని వారు తప్పు పడుతున్నారు. గతంలో టీటీడీ (TTD)పాలక మండలిలో కొద్ది మందికే చోటుండేది కానీ జగన్ సర్కార్ వచ్చాక ఆ మండలి రాజకీయ పునరావాస కేంద్రంగా మారి పోయిందన్న ఆరోపణలు ఉన్నాయి.
జంబో జట్టును తయారు చేశారు. ఇదిలా ఉండగా తాజాగా టీటీడీ చైర్మన్ త్వరలోనే ఆఫ్ లైన్ ద్వారా కూడా స్టార్ట్ చేస్తామని వెల్లడించారు. గత ఏడాది సెప్టెంబర్ 25 నుంచి రద్దు చేశామని తెలిపారు.
కాగా ఆన్ లైన్ లో టోకెన్లు జారీ చేసినా గ్రామీణ ప్రాంతాలకు చెందిన సామన్య భక్తులకు అందడం లేదని దీంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
తిరుపతి స్మార్ట్ సిటీలో భాగంగా నిర్మిస్తున్న శ్రీనివాస సేతు ఫ్లై ఓవర్ తొలి దశ నిర్మాణాన్ని సీఎం జగన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని వెల్లడించారు వైవీఎస్.
Also Read : అంగరంగ వైభవం శ్రీరామనగరం