Ramanujacharya : రూ. 1000 కోట్లతో నభూతో నభవిష్యత్ అన్న రీతిలో నిర్మించిన సమతామూర్తి శ్రీ రామానుజాచార్యుల మహోత్సవం ప్రారంభమైంది. నేటి నుంచి ఈనెల 14 వరకు ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు.
భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఈనెల 5న భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా 216 అడుగులతో నిర్మించిన రామానుజుడి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.
ఈ సందర్భంగా ఆయన ఐదు గంటల పాటు ముచ్చింతల్ ఆశ్రమంలోనే ఉంటారు. పీఎంతో పాటు రాష్ట్రపతితో పాటు దేశ , విదేశాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు.
5 వేల మందికి పైగా రిత్వికులు పాల్గొంటున్నారు. పెద్ద ఎత్తున యాగశాలలను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోంది. వేలాది మంది పోలీసులను మోహరించింది.
ఈ విగ్రహం ప్రపంచంలోనే రెండోది. మొదటిది బ్యాంకాక్ లో 316 అడుగుల బుద్దుడి విగ్రహం ఏర్పాటైంది. ఇక రామానుజుడి విగ్రహాన్ని 216 అడుగులతో నిర్మించారు.
40 ఎకరాలలో ఏర్పాటైన శ్రీరామనగరం ఆశ్రమం ఇప్పుడు శోభాయమానంగా తయారైంది. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ స్వామి మంగళ శాసనాలు చేశారు.
ఈ పరమ పవిత్రమైన మహోత్సవ కార్యక్రమానికి తరలి వస్తున్న వారందరికీ పేరు పేరునా ఆశీర్వచనం చేశారు. అంతరాలు లేని సమాజం కోసం కృషి చేసిన మహనీయుడు రామానుజుడు (Ramanujacharya)అని పేర్కొన్నారు.
శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం ఉత్సవాలను ఆయనకు నివాళిగా నిర్వహిస్తున్నామన్నారు. కూలీల నుంచి నిరుద్యోగుల దాకా ప్రతి ఒక్కరు తమకు తోచిన రీతిలో విరాళాలు అందజేశారన్నారు.
ఈ మొత్తం విగ్రహ ఏర్పాటుకు రూ. 1000 కోట్లు ఖర్చు చేశారు. 32 కోట్లు ప్రభుత్వానికి దిగుమతి సుంకం చెల్లించారు. రామానుజ (Ramanujacharya)సహస్త్రాబ్ది ఉత్సవాలలో భాగంగా ప్రధాన యాగశాల కళకళలా లాడుతోంది.
సినీ చిత్ర కళాకారుడు ఆనంద్ సాయి ఆధ్వర్యంలో ప్రవచన మండపంలో వేదికను అందంగా ముస్తాబు చేశారు. ఇక్కడ 2 వేల మందికి సరిపడా ఏర్పాటు చేశారు.
ఇక్కడి నుంచే ప్రముఖులు, ఆధ్యాత్మిక గురువులు, వారి ప్రసంగాలు, ప్రవచనాలు అందిస్తారు. యాగశాల సమీపంలో ప్రభుత్వ వైద్య శాఖతో పాటు యశోద ఆస్పత్రి ఆధ్వర్యంలో వైద్య సేవలు ఏర్పాటు చేశారు.
తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫోటో చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు.
Also Read : సమతా మూర్తికి సమున్నత గౌరవం