Ramanujacharya : సమతామూర్తి శ్రీ రామానుజుడి జీవితం ఆదర్శ ప్రాయం. మనుషులంతా ఒక్కటే. సర్వ ప్రాణులు సమానమేనని వెయ్యేళ్ల కిందట చాటాడు. కుల, మతాలను, వర్గ విభేదాలను నిరసించాడు. అక్షాక్షరీ మహా మంత్రాన్ని ఉపదేశించాడు.
ఆయన జీవితం, అనుసరించిన మార్గాన్ని ప్రతి ఒక్కరికీ అందేలా, స్పూర్తి దాయకంగా ఉండేలా రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లో ఏర్పాటు చేసిన శ్రీరామనగరం ఆశ్రమంలో రామానుజుడి(Ramanujacharya )విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
రూ. 1000 కోట్లతో 216 అడుగులతో ఏర్పాటైన దీనిని సమతామూర్తి కేంద్రంగా నామకరణం చేశారు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి.
ఆయన ఆనాడు అందించిన స్పూర్తి పది కాలాల పాటు భావి తరాలకు అందించాలనే సత్ సంకల్పంతో దీనిని ఏర్పాటు చేశారు.
ఎటు చూసినా భక్తి భావం విలసిల్లేలా, ఆ భావ జలధార ప్రతి ఒక్కరికీ అందేలా చేసేందుకే రామానుజుడి (Ramanujacharya )భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు ఈ సందర్భంగా సెలవిచ్చారు చినజీయర్ స్వామి.
ఆనాటి స్ఫూర్తిని నేటికి నిలిచేలా, ఆయన కోరిన సమానత్వ భావనను ప్రపంచానికి తెలియ చేసేందుకు కంకణ బద్దులు కావాలని పిలుపునిచ్చారు.
సకల మానవులందరూ వారి బోధనలు తెలుసు కోవాలని, ప్రతి ఒక్కరూ ఆ మార్గంలో నడవాలని, మరో వెయ్యేళ్ల పాటు రామానుజుడిని గుర్తుంచు కోవాలన్నారు చినజీయర్ స్వామి.
రామానుజ సహస్రాబ్ది సమారోం ప్రారంభమైంది. ఆధ్యాత్మిక సంప్రదాయానికి సంబంధించిన పీఠాధిపతులు కొలువుతీరారు. భగవంతుని దృష్టిలో అంతా సమానులే.
అందరూ మోక్షం పొందేందుకు అర్హులేనని చాటి చెప్పిన మహానుభావుడు శ్రీమద్రామానుజులు. తిరుమంత్రాన్ని అందరికీ వినిపించేలా చెప్పారు. అంతా సమానమని చాటారు.
Also Read : అక్కడ బుద్దుడు ఇక్కడ రామానుజుడు