Modi : రామానుజుడి వెయ్యేళ్ల పండగ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ముచ్చింతల్ లోని శ్రీరామనగరం. ఈనెల 14 వరకు మహోత్సవాలు కొనసాగుతున్నాయి.
ఈనెల 5న భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Modi )ప్రత్యేకంగా హాజరవుతారు. ఈ సందర్భంగా ఆశ్రమంతో పాటు సమతామూర్తి కేంద్రాన్ని కేంద్రం నుంచి వచ్చిన మోదీ వ్యక్తిగత భద్రతా సిబ్బందితో పాటు ఎస్పీజీ డీఐజీ బృందం ప్రత్యేకంగా పరిశీలించింది.
మోదీకి స్వాగతం పలికేందుకు ప్రత్యేకంగా హెలిప్యాడ్ దిగేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. రూ. 1000 కోట్లతో 216 అడుగులతో నిర్మించిన శ్రీ రామానుజుడు భారీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు ప్రధాన మంత్రి.
ఇదే సమయంలో ఆవిష్కరించిన అనంతరం విగ్రహాన్ని జాతికి అంకితం చేస్తారు. దాదాపు 5 గంటలకు పైగా ఉంటారని సమాచారం. ఇందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు హాజరైన 5 వేల మంది రిత్వికులు ప్రధాని మోదీకి మంగళా శాసనాలు అందజేస్తారు.
ప్రధానికి ఆహ్వానం పలకడం దగ్గరి నుంచి ఆయన తిరిగి వెళ్లేంత వరకు పూర్తిగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారు. ఇప్పటికే స్టీఫెన్ రవీంద్ర ఆధ్వర్యంలో 7 వేల మంది భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
దాదాపు రెండున్నర గంటలకు పైగా శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామితో ఎస్పీజీ బృందం సమావేశమైంది. ఏర్పాట్లు, భక్తులు, నిర్వాహకులు, ప్రధానితో ఎవరెవరు ఉంటారనే దానిపై పూర్తిగా చర్చించారు.
ఎస్పీజీ క్లియరెన్స్ ఇస్తేనే ప్రధానమంత్రి ఇక్కడికి వస్తారు లేదంటే ఆయన పర్యటన ఆగి పోతుంది. ప్రపంచం లోనే శ్రీరామానుజుడి విగ్రహం రెండోది కావడం విశేషం. అంతకంటే పెద్దది బ్యాంకాక్ లోని బుద్దుడి విగ్రహం ఉంది.
Also Read : అష్టాక్షరీ మహా మంత్రం స్మరణీయం