Ramanujacharya : రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ లోని 45 ఎకరాలలో ఏర్పాటు చేసిన శ్రీరామనగరం ఇప్పుడు భక్తి వైభవాన్ని చాటుతోంది. ఎటు చూసినా ఆధ్యాత్మిక జలధారలు కురుస్తున్నాయి.
మానవ జీవితానికి ముక్తి లభించాలంటే భక్తి ఒక్కటే మార్గమని బోధిస్తోంది. అన్ని జన్మల కంటే మానవ జన్మ అత్యంత ఉత్కృష్టమైనదని, కుల, మతాలు, వర్గ విభేదాలు అన్నవి లేవని వెయ్యేళ్ల కిందటే ఈ ప్రపంచానికి చాటి చెప్పిన మహానుభావుడు శ్రీ రామానుజాచార్యులు(Ramanujacharya ).
ఈ నేల మీద పుట్టిన ప్రతి ఒక్కరికి ఆలయలను దర్శించుకునే హక్కు ఉంటుందని చాటి చెప్పే ప్రయత్నం చేశారు.
ఈ సందర్భంగా వెయ్యేళ్ల కిందటి ఆ స్పూర్తిని నేటి తరాలకు, రాబోయే తరాలకు ఆదర్శ ప్రాయంగా ఉండాలనే సత్ సంకల్పంతో జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి రామానుజుల (Ramanujacharya )విగ్రహాన్ని ఐకాన్ గా ఉండేలా ఏర్పాటు చేశారు.
దీనికి భారీ ఎత్తున ఖర్చు అయ్యింది. పది ఏళ్లు పట్టింది. 216 అడుగుల ఎత్తులో దీనిని చైనాకు చెందిన కంపెనీ నిర్మాణంలో పాలు పంచుకుంది. 60 మందికి పైగా నిపుణులు కీలక పాత్ర పోషించారు.
ఈ అరుదైన భారీ విగ్రహం ఆవిష్కరణకు దేశ ప్రధాన మంత్రి మోదీ రానున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం దేశం నలుమూలల నుంచి వచ్చిన రిత్వికులు, పండితులు, భక్తులతో సమాతా మూర్తి కేంద్రం కిటకిట లాడుతోంది.
ఇసుక వేస్తే రాలనంత భక్త జనం జై శ్రీరమన్నారాయణ అంటూ నినదిస్తున్నారు. ప్రస్తుతం సమతా కేంద్రం దేదీప్యమానంగా వెలుగుతోంది. భక్తి ప్రపత్తులతో అలరారుతోంది.
Also Read : పుష్ప చిత్రం గరికపాటి ఆగ్రహం