KCR Chinnajeeyar : ఈ దేశంలో జరిగిన భక్తి ఉద్యమంలో శ్రీ రామానుజాచార్యులు అరుదైన విప్లవం తీసుకు వచ్చారని ఆ స్పూర్తి నిత్యం దీపమై వెలుగుతూ ఉండాలని ఆకాంక్షించారు సీఎం కేసీఆర్.
ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమ ఆవరణలో 216 అడుగులతో ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహాన్ని ఆయన పరిశీలించారు. భక్తుడిగా ఇంతకంటే ఇంకేం కావాలని అన్నారు.
జీవితం ఆనందయం కావాలన్నా, మానసిక ప్రశాంతత చేకూరాలన్నా భక్తి అన్నది అవసరమని స్పష్టం చేశారు సీఎం. వెయ్యేళ్ల కిందటే సర్వ మానవులంతా ఒక్కటేనని చాటి చెప్పారని, ఆలయాల్లోకి అందరికీ ప్రవేశం ఉండాలని పోరాడిన ధీశాలి, గొప్ప సంఘ సంస్కర్త రామాజునుల వారని కొనియాడారు కేసీఆర్.
సమస్త ప్రాణ కోటి అంతా ఒక్కటేనని భేద భావాలు, కుల మతాలు, వర్గ విభేదాలు ఉండ రాదని, సత్ సంకల్పంతో కృషి చేసిన తీరు ప్రతి ఒక్కరికీ ఆదర్శ ప్రాయం కావాలని పిలుపునిచ్చారు.
విరాట్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పారు. తెలంగాణకు తలమానికం దేశానికి గర్వ కారణమంటూ ప్రశంసించారు కేసీఆర్.
శ్రీరామానుజ సహస్రాబ్ది మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించడం బాగుందన్నారు. రేపు ఇక్కడికి విగ్రహ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి మోదీ రానుండడంతో ఏర్పాట్ల గురించి ఆరా తీశారు.
ఎంతో శ్రమకోర్చి ప్రతిష్టించిన ఈ సమతామూర్తి సమతా కేంద్రం అరుదైన దేవాలయమని పేర్కొన్నారు. భక్తులకు ఆధ్యాత్మిక సాంత్వనతో పాటు మానసిక శాంతి చేకూరుతుందని చెప్పారు కేసీఆర్(KCR Chinnajeeyar).
రామానుజుడు చూపిన మార్గం రాబోయే తరాలకు ఓ పాఠంగా ఉంటుందన్నారు.
Also Read : ఆధ్యాత్మికతకు ఆలవాలం శ్రీరామనగరం