Sri Ramanujacharya : సమతా మూర్తి సదా స్మరామి
శ్రీరామనగరం భక్త జన సందోహం
Sri Ramanujacharya :మనుషుల్ని వేరు చేసి దైవానికి దూరం చేయడాన్ని నిరసించారు. కుల, మతాలు అన్నవి మనుషుల్ని కలిపేవిగా ఉండాలని వెయ్యేళ్ల కిందటే ప్రచారం చేసిన మహనీయుడు శ్రీ రామానుజాచార్యులు(Sri Ramanujacharya).
ధర్మ నిబద్దత అన్నది ముఖ్యమని, సత్య నిష్టతతో ఉండాలని సూచించారు. పరులను ప్రేమించాలని, సర్వ మానువులంతా ఒక్కటేనని, సకల జీవరాశులన్నీ ఈ లోకంలో సమానమేనని చాటి చెప్పారు.
ఆయన బోధనలు నిత్యం అనుసరణీయం. స్పూర్తిదాయకం కూడా. ఆ మహనీయుడు చూపిన మార్గం భక్త కోటికి స్మరణీయంగా ఉండాలని సమస్త మానవాళికి ఆదర్శ ప్రాయంగా విలసిల్లాలని జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి సత్ సంకల్పానికి పూనుకున్నారు.
ఆ దిశగా తను ఆచరిస్తూ ఈ భక్త కోటిని ఆ వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. జీవితం పరిపూర్ణం కావాలంటే భక్తి ఒక్కటే సాధనం. అదే మార్గం.
అందుకే శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని నేటి తరంతో పాటు రాబోయే తరాలకు కూడా స్పూర్తి దాయకంగా ఉండేలా ఏర్పాటు చేశారు. ఇప్పుడు దేశం సమతా కేంద్రం వైపు చూస్తోంది.
ఆధ్యాత్మిక ఆలవాలంతో అలరారుతున్న ఈ సమతామూర్తి ఎల్లప్పటికీ సాంత్వన కలిగించేలా, ధర్మ నిష్టను పెంపొందించేలా చేస్తుందంటారు రిత్వికులు.
టెక్నాలజీ విస్తరించినా భక్తి అన్నది లేక పోతే మనుషులకు ప్రశాంతత అన్నది లేకుండా పోతుంది. అందుకే ఆధ్యాత్మిక చింతన, భావన అన్నది ఉండాలంటారు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి.
ఆ మహనీయుడే మకుటధారిగా భావించి ముందుకు సాగడమే మనందరి ముందున్న లక్ష్యం.
Also Read : గద్దర్ నోట రామానుజుడి పాట