Modi Ramanuja : మోదీ రాక కోసం ‘స‌మ‌తా కేంద్రం’ సిద్ధం

రేపే స‌మ‌తామూర్తి ప్రారంభోత్స‌వం

Modi Ramanuja : దేశ ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఈనెల 5న హైద‌రాబాద్ కు రానున్నారు. రేపు వ‌సంత పంచ‌మి. రంగారెడ్డి జిల్లా ముచ్చింత‌ల్ లో 45 ఎక‌రాల‌లో కొలువు తీరిన శ్రీ‌రామ‌న‌గ‌రంను సంద‌ర్శిస్తారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌పంచంలోనే రెండోదిగా వినుతికెక్కిన 216 అడుగులతో ఏర్పాటు చేసిన శ్రీ రామానుజాచార్యుల విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తారు. మొద‌ట‌గా ప్ర‌ధాని మోదీ(Modi Ramanuja) ఇక్రిశాట్ ను సంద‌ర్శిస్తారు.

అనంతరం రామానుజాచార్యుల స‌హ‌స్రాబ్ది స‌మారోహ కార్య‌క్ర‌మానికి హాజ‌ర‌వుతారు. వెయ్యేళ్ల కింద‌ట కుల‌, మ‌తాలు, వ‌ర్గ‌, విభేదాలు ఉండ కూడ‌ద‌ని దైవం అంద‌రికీ స‌మానమ‌ని పోరాడిన ధీశాలి రామానుజుడు.

ఆయ‌న మార్గం స్పూర్తి దాయ‌కంగా భావి త‌రాల‌కు అందించాల‌నే స‌త్ సంక‌ల్పంతో జ‌గ‌త్ గురు శ్రీ రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి రూ. 1000 కోట్ల‌తో రామానుజుడు విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు.

చైనా కంపెనీ దీనిని నిర్మించింది. ఇందులో 60 మంది నిపుణులు పాల్గొన్నారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌ధాన మంత్రి ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.

ఇప్ప‌టికే ఎస్పీజీ టీం ఒక‌సారి వ‌చ్చి ప‌రిశీలించింది. చిన్న‌జీయ‌ర్ తో చ‌ర్చించింది. రాష్ట్ర పోలీస్ ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష జ‌రిపారు. అంత‌కు ముందు తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ స‌మీక్ష చేప‌ట్టారు.

మోదీ భ‌ద్ర‌త కోసం 8 వేల సిబ్బందిని ఏర్పాటు చేశారు. శ్రీ‌రామ‌న‌గ‌రంలో క‌మాండ్ కంట్రోల్ రూంతో పాటు ప్ర‌ధాని, ఇత‌ర ప్ర‌ముఖులు దిగే హెలిపాడ్ , మోడీ బ‌స చేసే గెస్ట్ హౌస్ ను ప‌రిశీలించారు.

Also Read : స‌మ‌తామూర్తి స్పూర్తి లోకానికి దిక్సూచి

Leave A Reply

Your Email Id will not be published!