Chinnajeeyar Swamy : చిన్న‌జీయ‌ర్ సంక‌ల్పం స‌మాతా కేంద్రం

వెయ్యేళ్ల రామానుజుడి విగ్ర‌హం సిద్దం

Chinnajeeyar Swamy : జ‌గ‌త్ గురువుగా వినుతి కెక్కిన శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న‌జీయ‌ర్ స్వామి ప‌దేళ్ల క‌ల ఫ‌లించింది. స‌త్ సంక‌ల్పం సాకార‌మైంది. ఎన్నో క‌ష్టాల‌ను త‌ట్టుకుని ఇబ్బందుల‌ను అధిగ‌మించి దేశంలోనే అతి పెద్ద విగ్ర‌హం ఏర్పాటైంది.

భ‌క్త జ‌న కోటికే కాదు స‌మ‌స్త మాన‌వాళికి, నేటి త‌రానికి రాబోయే త‌రాల‌కు స్పూర్తి దాయ‌కంగా ఉండేలా అతి పెద్ద భారీ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశారు. ఇందు కోసం రూ. 1000 కోట్లు ఖ‌ర్చు చేశారు.

ప్ర‌త్యేకంగా చైనాలో త‌యారు చేసింది ఇండియాకు తీసుకు వ‌చ్చారు. ప్ర‌స్తుతం రామానుజుడి మ‌హోత్స‌వాలు ఈనెల 14 దాకా కొన‌సాగుతాయి. ఇందులో భాగంగా వేలాది మంది భ‌క్తులు కొలువు తీరారు.

స్వామి వారి క‌రుణ క‌టాక్షాల కోసం వేచి చూస్తున్నారు. దేశానికి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ విచ్చేస్తున్నారు. ఇవాళ ఆయ‌న స్వ‌హ‌స్తాల‌తో ఆ మ‌హ‌నీయుడి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తారు.

ఇందు కోసం భారీ ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో మౌలిక వ‌స‌తి సౌక‌ర్యాల‌ను క‌ల్పించారు. ఎవ‌రికీ ఇబ్బంది క‌ల‌గ‌కుండా చూడ‌డంతో శ్రీ‌రామ‌న‌గ‌రం దేదీప్య మానంగా వెలుగుతోంది.

జై శ్రీ‌మ‌న్నారాయ‌ణ నామ మంత్రంతో పుల‌కించి పోతోంది. అదిగో స‌మాతామూర్తి ఇదిగో స‌మ‌తా కేంద్రం. ఎక్క‌డ చూసినా స్వామి వారి విగ్ర‌హం దీవిస్తున్న‌ట్లుగా ఉంది.

భ‌క్త జ‌న‌సందోహంతో అల‌రారుతోంది ఈ ప్రాంతమంతా. ఈ ఘ‌న‌త శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి(Chinnajeeyar Swamy) వారి సంక‌ల్పానికే ద‌క్కుతుంది. రామానుజుడి స్పూర్తి క‌ల‌కాలం వ‌ర్దిల్లాల‌ని కోరుకుందాం.

Also Read : స‌మ‌తామూర్తి స్పూర్తి లోకానికి దిక్సూచి

Leave A Reply

Your Email Id will not be published!