Modi Ramanuja : భక్త జనం ఎన్నో ఏళ్లుగా వేచి చూసిన క్షణాలు రానే వచ్చాయి. వెయ్యేళ్ల కిందట ఈ భూమి మీద నడయాడిన శ్రీ రామానుజాచార్యుల భారీ విగ్రహం ఆవిష్కరణకు ముస్తాబైంది.
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ (Modi Ramanuja )సమతా మూర్తిని ఆవిష్కరిస్తారు. అనంతరం భారత జాతికి అంకితం చేస్తారు. రూ 1000 కోట్లు చేశారు.
పదేళ్ల పాటు ఈ విగ్రహం రూపు దిద్దుకునేందుకు సమయం పట్టింది. దీని వెనుక జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి వారి సంకల్పం తోడై ఉంది. ఆయన పట్టుదల, అకుంఠిత దీక్ష వల్లనే ఈ విగ్రహం సాక్షాత్కారమైంది.
తరాలు గడిచినా నేటి తరానికే కాదు భవిష్యత్ తరాలు కలకాలం గుర్తుంచు కునేలా, నిత్యం స్మరణం చేసుకునేలా, పాఠంగా స్పూర్తి దాయకంగా ఉండేందుకే రామానుజుడి (Modi Ramanuja )విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
దీంతో రంగారెడ్డి జిల్లా లోని ముచ్చింతల్ శ్రీరామనగరం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వచ్చారు.
ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈ రామానుజుడి మహోత్సవాలు ఈనెల 14 దాకా కొనసాగుతాయి. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్నీ తానై దగ్గరుండి ఏర్పాట్లు చేసింది.
ఏ ఒక్కరికీ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు వసతులు సమకూర్చింది. ఇక ప్రధాన మంత్రి రాక సందర్భంగా ఇప్పటికే కమాండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. 8 వేల మందికి పైగా భద్రతా సిబ్బంది పాల్గొంటున్నారు.
Also Read : చిన్నజీయర్ ఆశీర్వాదం కేసీఆర్ సంతోషం